
స్టోక్స్ దూరం
టీ20 ప్రపంచకప్ 2021 ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అందరూ ఊహించిన విధంగానే ఈసీబీ ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తప్ప.. రెగ్యులర్‌గా టీ20ల్లో ఆడే ఇంగ్లీష్ ప్లేయర్స్ అందరు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. మానసిక సమస్యల కారణంగా స్టోక్స్ క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. 2019 వన్డే ప్రపంచకప్ విజయంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. స్టోక్స్ దూరమైనా.. ఇంగ్లండ్ జట్టు పటిష్టంగానే ఉంది. చూస్తే ఈసారి కప్ కొట్టేలా కనిపిస్తోంది.

జట్టులోకి టిమల్ మిల్స్
వైటాలిటీ టీ20 బ్లాస్ట్ మరియు ది హండ్రెడ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఫాస్ట్ బౌలర్ టిమల్ మిల్స్‌ను ఇంగ్లండ్ సెలెక్టర్లు టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేశారు. దాంతో 2017 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి మిల్స్ జట్టులోకి వచ్చాడు. 'టిమల్ మిల్స్ ప్రపంచకప్ ఆడేందుకు పూర్తి అర్హుడు.
గత రెండు సంవత్సరాలుగా అతని ప్రదర్శన, నైపుణ్యాలు బాగున్నాయి. తానేంటో నిరూపించుకున్నాడు. మిల్స్ అసాధారణమైన వేగం అతడి ప్రత్యేకత. అతను మా బౌలింగ్ విభాగానికి వైవిధ్యాన్ని జోడిస్తాడు' అని ఇంగ్లండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ అన్నారు.

రూట్, ఆర్చర్ ఔట్
ఈ ఏడాది ప్రారంభంలో పొట్టి ఫార్మాట్‌లో పునరాగమనం చేయాలనే కోరికను బయటపెట్టిన టెస్ట్ కెప్టెన్ జో రూట్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. ఇక గాయపడిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా జట్టుకు దూరమయ్యాడు. 'మేము అన్ని విభాగాలను కవర్ చేసే ఒక స్క్వాడ్‌ని ఎంచుకున్నాం. కొందరు స్టార్ ప్లేయర్స్ మిస్ అయ్యారు. అయినా జట్టు బాగుంది. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొనే ఈ మెగా టోర్నమెంట్‌లో విజయవంతం కావాలని నేను ఆశిస్తున్నా' అని ఇంగ్లండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ చెప్పుకొచ్చాడు.

పటిష్టంగా ఇంగ్లండ్
ఇయాన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, జోనాథన్ బెయిర్‌స్టోలతో బ్యాటింగ్ విభాగం.. క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, అదిల్ రషీద్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్ లాంటి ఆల్‌రౌండర్‌లు కూడా ఉన్నారు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియాను ఓడించే సత్తా ఈ ఇంగ్లండ్ జట్టుకు ఉందని అందరూ అంటున్నారు. అయితే భారత్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌లో తలపడే అవకాశం ఉంది.

ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోనాథన్ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, అదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
స్టాండ్ బై ప్లేయర్లు: టామ్ కరన్, లియామ్ డాసన్, జేమ్స్ విన్స్.


Click it and Unblock the Notifications

T20 World Cup 2021: స్టార్ ఓపెనర్‌కు షాక్.. రిజర్వ్ బెంచ్‌కే సీనియర్ పేసర్! బంగ్లాదేశ్ ప్రపంచకప్ జట్టు ఇదే!!










