Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK:ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ చాహర్!

Will Deepak Chahar replace Avesh Khan in India vs Pakistan Asia Cup Super 4 match?

దుబాయ్: భారత్ X పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్‌కు ముందు అభిమానులకు గుడ్ న్యూస్. జ్వరంతో బాధపడుతున్న ఆవేశ్ ఖాన్ స్థానంలో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న ఆవేశ్ ఖాన్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ చాహర్‌ను జట్టులోకి తీసుకున్న టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని తుది జట్టులోకి తీసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. మరోవైపు జింబాబ్వే పర్యటనలో సత్తా చాటిన దీపక్ చాహర్.. పాక్‌తో ఆడేందుకు సిద్దమయ్యాడు. నెట్స్‌లో అతను తీవ్రంగా శ్రమించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

అయితే దీపక్ చాహర్ జట్టులో చేరికపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. మరికొద్దిసేపట్లోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
ఆసియాకప్ లీగ్‌ దశలో పాక్‌ను మట్టికరిపించిన టీమిండియా.. సూపర్ మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్‌ మధ్యలోనుంచి తప్పుకున్నాడు. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. అయితే అతను తుది జట్టులో ఆడుతాడా? లేదా? అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. అక్షర్ పటేల్‌కు బదులు దీపక్ చాహర్‌ను తుది జట్టులో ఆడించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది.

దీపక్ చాహర్‌ పవర్‌ప్లే కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్‌ చేయగలడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు గాయపడిన చాహర్‌.. తిరిగి జింబాబ్వే సిరీస్‌తో పునరాగమనం చేశాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన చాహర్‌ 5 వికెట్లతో అదరగొట్టాడు. లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటం అతనికి కలిసొచ్చే అంశం.

Story first published: Sunday, September 4, 2022, 18:38 [IST]
Other articles published on Sep 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+