For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Mega Auction: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో డేవిడ్ వార్నర్ ప్రయాణం కొనసాగెనా?

Will David Warner Be Retained To SRH In IPL 2022 Mega Auction?
IPL 2022 Mega Auction: నలుగురి కే ఛాన్స్ Warner VS Kane Williamson మధ్య తీవ్ర పోటీ | Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2022 సీజన్ కోసం బీసీసీఐ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది రెండు కొత్త ఫ్రాంచైజీలతో కలిపి మొత్తం 10 టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించేందుకు ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. ఇందులో భాగంగా రెండు కొత్త ఫ్రాంచైజీల ఏర్పాటుకు మూహూర్తం దాదాపుగా ఖరారైంది. ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన టెండర్లను పిలవనున్నారు.

అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్రాంచైజీలను కన్ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. ఫ్రాంచైజీల సంఖ్య పెరుగుతుండటంతో.. వాటికి ప్లేయర్లను కూడా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెగా ఆక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. వాస్తవానికి 2021లోనే ఈ మెగా ఆక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండాల్సి ఉన్నా.. కరోనా దెబ్బకు ఏడాది వాయిదా పడింది.

నలుగురికే చాన్స్..

నలుగురికే చాన్స్..

ఇక ప్లేయర్ల రిటెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆటగాళ్ల సాలరీ, ఫ్రాంచైజీల జీతాల నిధి వంటి విషయాలపై ఇప్పటికే బీసీసీఐ కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీల సాలరీ పర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా రూ. 85 నుంచి 90 కోట్లకు పెంచారు. రిటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల విషయంలో బీసీసీఐ స్పష్టతకు వచ్చింది. ప్రతి ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్లను రిటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది.

ఇందులో ముగ్గురు ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒకరు ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. లేదంటే ఇద్దరు ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను ఎంచుకోవచ్చు. ముగ్గురు ప్లేయర్లను రిటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటే... రూ. 15 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 7 కోట్లు చెల్లించాలి. ఇద్దర్ని చేసుకుంటే రూ. 12.5 కోట్లు, రూ. 8.5 కోట్లు ఇవ్వాలి. ఒక్కర్నే చేసుకుంటే రూ. 12.5 కోట్లు సాలరీ కింద ఇవ్వాలి.

డేవిడ్ వార్నర్ X కేన్ విలియమ్సన్..

డేవిడ్ వార్నర్ X కేన్ విలియమ్సన్..

అయితే తాజా నిబంధనల నేపథ్యంలో సన్‌రైజన్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా? అనేది చర్చనీయాంశమైంది. మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌, కెప్టెన్ కేన్ విలియమ్సన్, మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యంగ్ సెన్సేషన్ నటరాజన్‌లలో నలుగురిని తీసుకునే చాన్స్ ఉందని ఆరెంజ్ ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విదేశీ కోటాలో ఇద్దరు ప్లేయర్లు తీసుకున్నా.. అందులో రషీద్ ఖాన్ ఉండటం ఖాయం. ఈ మిస్టరీ స్పిన్నర్‌ను వదులుకునే సాహసం సన్‌రైజర్స్ చేయకపోవచ్చు. దాంతో మిగిలిన ఓ స్లాట్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం విలియమ్సన్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది.

వార్నర్ ప్రయాణం కొనసాగెనా?

వార్నర్ ప్రయాణం కొనసాగెనా?

2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మొదలైన డేవిడ్ వార్నర్ ప్రయాణం.. 2020 సీజన్ వరకు ఘనంగా కొనసాగింది. జట్టులోకి వచ్చిన మరుసటి ఏడాది 2015లోనే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న డేవిడ్ భాయ్.. 2016లో 800 ప్లస్ రన్స్‌తో టైటిల్ అందించాడు. ఇప్పటి వరకు సన్‌రైజర్స్ గెలిచిన ఏకైక టైటిల్ అదే. ట్యాంపరింగ్ ఆరోపణలతో 2018 సీజన్‌కు దూరమైనా.. 2019లో ఆటగాడిగా దుమ్మురేపాడు. యూఏఈ వేదికగా జరిగిన 2020 సీజన్‌లోనూ రాణించాడు. 2016 నుంచి అతను ఆడిన ప్రతీ సీజన్‌లో 500కు పైగా పరుగులు చేశాడు. లీగ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డును అందుకున్నాడు.

చెలరేగితేనే చాన్స్..

చెలరేగితేనే చాన్స్..

ఐపీఎల్ గ్రెటేస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ ఆటగాల్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. అలాంటి వార్నర్‌ పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా కఠినంగా వ్యవహరించింది. ఈ సీజన్ ఫస్టాఫ్‌లో జట్టు వైఫల్యానికి బాధ్యుణ్ని చేస్తూ కెప్టెన్సీపై వేటు వేయడమే కాకుండా జట్టు నుంచి తప్పించింది. కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వార్నర్ కూడా ఎన్నడూ లేని విధంగా విఫలమయ్యాడు.

6 మ్యాచ్‌ల్లో కేవలం 191 రన్సే చేశాడు. స్ట్రైక్‌రేట్ కూడా గొప్పగా లేదు. ఈ క్రమంలో తాజా రిటైన్ నిబంధనలు కూడా వార్నర్‌కు ప్రతికూలంగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్ బెస్ట్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను కాదని వార్నర్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోవడం కష్టమే. కానీ యూఏఈ వేదికగా జరిగే సెకండాఫ్ మ్యాచ్‌లో దుమ్మురేపినా.. అప్ కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో రాణించినా టీమ్‌మేనేజ్‌మెంట్ తన ఆలోచనను మార్చుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల అభిమానులకు చాలా దగ్గరైన వార్నర్.. వచ్చే సీజన్‌లో కూడా సన్‌రైజర్స్‌కే ఆడాలని వారంతా కోరుకుంటున్నారు.!

Story first published: Tuesday, July 6, 2021, 15:45 [IST]
Other articles published on Jul 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+