ఐపీఎల్‌కు ఎండదెబ్బ..?
ఐపీఎల్ మ్యాచ్‌ల ఊపు ఒక్కసారిగా చల్లబడింది. హోరాహోరీగా జరగాల్సిన మ్యాచ్‌లు పూర్తిగా ఏకపక్షంగా సాగుతున్నాయి. వరుసగా గత మూడు మ్యాచ్‌లు చప్పగా ముగిసాయి. రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగులతో గెలిస్తే.. మొన్న సీఎస్‌కే 32 పరుగులతో కేకేఆర్‌ను చిత్తు చేసింది.
నిన్న లక్నో సూపర్ జెయింట్స్‌ను ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో ఓడించింది. 29 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ లోస్కోరింగ్ గేమ్ అభిమానులకు బోర్ కొట్టించింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మినహా ఈ మ్యాచ్‌లో అభిమానులు ఆస్వాదించిన క్షణం ఒక్కటి కూడా లేదు.
ఎండదెబ్బతో..
ఈ మూడు మ్యాచ్‌ల్లో వికెట్లు స్లోగా ఉండటంతో బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. మరోవైపు బౌలర్లు నిప్పులు చెరిగారు. అయితే పిచ్‌లు ఇలా ఒక్కసారిగా నెమ్మదించడానికి ఎండదెబ్బే కారణంగా తెలుస్తోంది. విపరీతమైన ఎండల కారణంగా పిచ్‌లు పొడిగా మారి నెమ్మదిస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

పిచ్‌పై ఎంత నీళ్లు చల్లిన భారీ స్థాయిలో ఎండలు కొడుతుంటంతో జీవం లేకుండా తయారవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం ఆరెంజ్ క్యాప్ అందుకునే సమయంలో బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన కోహ్లీ.. విపరీతమైన ఎండల కారణంగానే పిచ్ నెమ్మదించిందని తెలిపాడు. ఈ విషయాన్ని తాము ముందే పసిగట్టి అందుకు తగినట్లుగా వ్యూహాలు రచించి అమలు చేశామని చెప్పాడు. ఇర్ఫాన పఠాన్, కేన్ విలియమ్సన్ సైతం.. విపరీతమైన ఎండల కారణంగా పిచ్‌లు స్లోగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు.
స్లో పిచ్‌లతో..
ఎండదెబ్బ కారణంగా పిచ్‌లు స్లోగా మారుతుండటంతో అభిమానులకు కావాల్సిన మజా లభించడంలేదు. దూకుడుకు అలవాటైన బ్యాటర్లు పిచ్ కండిషన్స్‌ను పట్టించుకోకుండా గుడ్డిగా షాట్స్ ఆడబోయి మూల్యం చెల్లించుకుంటున్నారు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడుతూ విజయం కోసం పోరాడలేకపోతున్నారు. దాంతో మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగుస్తున్నాయి.
పిచ్‌లు స్లోగా ఉన్నా.. లోస్కోరింగ్ గేమ్స్ అయినా హోరాహోరీగా సాగితే అభిమానులకు కావాల్సిన మజా అందుతుంది. కానీ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు తక్కువ స్కోర్‌కు పరిమితమైతే ఓటమిని అంగీకరించి చేతులెత్తేస్తున్నాయి. ఛేజింగ్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే ఓటమికి తల వంచుతున్నాయి.
ముగింపు పలకండయ్యా..
మరోవైపు సిక్సర్ల మోతకు అలవాటైన అభిమానులకు ఈ లోస్కోరింగ్ గేమ్స్ ఏ మాత్రం రుచించడం లేదు. దాంతో ఐపీఎల్ మ్యాచ్‌ల వ్యూస్ దారుణంగా పడిపోయాయి. ఎండదెబ్బ నుంచి పిచ్‌లను రక్షించేందుకు క్యూరెటర్లు కష్టపడుతున్నారు. బ్యాటింగ్ ట్రాక్‌లపై జరిగే మ్యాచ్‌లకే మంచి ఆదరణ లభిస్తుండటంతో బ్రాడ్‌కాస్టర్స్ కూడా నిర్వాహకులపై ఒత్తిడి తెస్తోంది. ఏది ఏమైనా ఈ ఏకపక్ష మ్యాచ్‌లకు ముగింపు పలకాలని అసలు సిసలు క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications