Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన SRH ఆల్‌రౌండర్.. 61 ఏళ్ల రికార్డ్‌ బద్దలు!

సౌతాఫ్రికా తాత్కలిక టెస్ట్ కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ వియాన్ మల్డర్ చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌ చరిత్రలోనే కెప్టెన్‌గా అరంగేట్ర మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వియాన్ మల్డర్ 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.ఈ త్రిశతకంతో ఈ సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

సెహ్వాగ్ రికార్డ్ జస్ట్ మిస్..

టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డ్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. అతను 2008లో సౌతాఫ్రికాతో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. అప్పటి నుంచి ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.

సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా వియాన్ మల్డర్(334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లతో 367 నాటౌట్) నిలిచాడు. ఈ క్రమంలో అతను హాషిమ్ ఆమ్లా(311) పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు.సౌతాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా కూడా మల్డర్ రికార్డ్ సాధించాడు.

Wiaan Mulder Smashes 2nd Fastest Test Triple Hundred Breaks 61-Year-Old Record

61 ఏళ్ల రికార్డ్ బద్దలు..

టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా కూడా మల్డర్ నిలిచాడు. అతను 27 ఏళ్ల 138 రోజుల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో అతను 61 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 1964లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బాబ్ సింప్సన్ 28 ఏళ్ల 171 రోజుల వయసులో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తాజాగా ఈ రికార్డ్‌ను మల్డర్ అధిగమించాడు. విదేశీ గడ్డపై జరిగిన టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన ఆటగాడిగా కూడా మల్డర్ నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హనీఫ్ మహమ్మద్(337) రికార్డ్‌ను అధిగమించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాడి కూడా మల్డర్ నిలిచాడు.

సంతోషంలో సన్‌రైజర్స్..

మల్డర్ ట్రిపుల్ సెంచరీ ధాటికి ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 626/5 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఐపీఎల్‌ 2025 సీజన్‌లో వియాన్ మల్డర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్ గాయపడటంతో అతని స్థానాన్ని వియాన్ మల్డర్‌తో భర్తీ చేసింది. మల్డర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ట్రిపుల్ సెంచరీ బాదిన వియాన్ మల్డర్‌కు సన్‌రైజర్స్ హైదారాబాద్ అభినందనలు తెలియజేసింది. వరుస పోస్ట్‌లతో సంతోషం వ్యక్తం చేసింది. డబ్ల్యూటీసీ 2025 విజయం తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా గాయంతో జట్టుకు దూరం కావడంతో వియాన్ మల్డర్ కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు.

Story first published: Monday, July 7, 2025, 17:00 [IST]
Other articles published on Jul 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+