WI vs SA T20 World Cup: రస్సెల్ బుల్లెట్ త్రో.. హెట్‌మైర్ కళ్లు చెదిరే క్యాచ్! (వీడియో)

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన గ్రూప్1 లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓటమిపాలైనప్పటికీ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో విండీస్ తీసిన రెండు వికెట్లు ఈ సూపర్ ఫీల్డింగ్‌తోనే రావడం విశేషం. ముందుగా ఆండ్రీ రస్సెల్ బుల్లెట్ త్రో తో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను రనౌట్ చేయగా.. ఆ తర్వాత హెట్‌మైర్ స్టన్నింగ్ క్యాచ్ ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ఈ సూపర్ ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైనా ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
బుల్లెట్ త్రో...
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ఆండ్రీ రస్సెల్ విసిరిన త్రోకు సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(2)రనౌట్‌గా వెనుదిరిగాడు. 100 కిలోమీటర్ల వేగంతో అతను విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకింది. విండీస్ బౌలర్ అకిల్ హుస్సేన్ వేసిన ఈ ఓవర్ చివరి బంతిని బవుమా మిడాన్ ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేసి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకున్న రస్సెల్ మ్యాజిక్ చేశాడు. వేగంగా ముందుకు పరుగెత్తుకు వచ్చిన రస్సెల్ బంతిని అందుకోని నేరుగా వికెట్లను హిట్ చేశాడు. దాంతో బవుమా నిరాశగా పెవిలియన్ చేరాడు.

స్టన్నింగ్ క్యాచ్..
ఆ తర్వాత అకిల్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ రెండో బంతిని సౌతాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్ డీప్‌స్కేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌కు సరిగ్గా తాకని బంతిని గాల్లోకి లేచింది. అయితే ఆ దిశలోనే ఫీల్డింగ్ చేస్తున్న హెట్‌మైర్ ముందుకు పరిగెత్తుకొచ్చి సూపర్ డైవ్‌తో అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే ఔట్ విషయంలో అంపైర్ క్లారిటీ లేకపోవడంతో థర్ఢ్‌అంపైర్ సమీక్ష కోరారు. సాఫ్ట్ సిగ్నల్‌లో నాటౌట్ అని చూపించగా.. రిప్లేలో మాత్రం బంతి ఎక్కడా నేలకు తగిలినట్లు కనిపించలేదు. హెట్‌మైర్ కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని తన చేతివేళ్ల మధ్యలో పట్టుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో రీజా హెండ్రిక్స్ ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు.

సౌతాఫ్రికా సూపర్ విక్టరీ..
ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (56) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డ్వేయిన్ ప్రిటోరియస్ మూడు, కేశవ్ మహరాజ్ రెండు, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే తలో వికెట్ తీశారు. అనంతరం 144 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ చేధించింది. 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 144 రన్స్ చేసి 10 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఎయిడెన్ మార్క్‌రమ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) మెరుపు హాఫ్ సెంచరీతో రాణించగా.. వాన్ డెర్ డస్సెన్(51 బంతుల్లో 3 ఫోర్లతో 43), రీజా హెన్రీక్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39) కీలక పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అకీల్ హోసెన్ ఓ వికెట్ తీయగా.. కెప్టెన్ టెంబా బవుమా(2) రనౌట్‌గా వెనుదిరిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications