Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WI vs SA: నిప్పులు చెరిగిన షమర్ జోసెఫ్.. 10 ఇన్నింగ్స్‌ల్లో మూడు 5 వికెట్ హాల్స్! (వీడియో)

వెస్టిండీస్ యువ పేసర్ షమర్ జోసెఫ్ నిప్పులు చెరిగాడు. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో(5/33) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఇందులో మూడు వికెట్లు క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. సొంతగడ్డపై అతనికి ఇదే తొలి 5 వికెట్ హాల్ కావడం గమనార్హం. కేవలం 10 ఇన్నింగ్స్‌ల తన టెస్ట్ కెరీర్‌లోనే షమర్ జోసెఫ్ మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

ఆస్ట్రేలియాతో అరంగేట్ర సిరీస్‌లోనే షమర్ జోసెఫ్ రెండు సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. కెరీర్ ఫస్ట్ టెస్ట్‌లోనే 5 వికెట్లతో నిప్పులు చెరిగాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లోనూ బ్యాటర్ల‌ను ఇబ్బంది పెట్టాడు. ప్రస్తుతం అతని బౌలింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. షమర్ జోసెఫ్ వేసిన కళ్లు చెదిరే ఇన్ స్వింగర్‌కు ఎయిడెన్ మార్క్‌రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

WI vs SA Shamar Joseph records maiden Test fifer on home soil

ఆ బంతిని ఆడే ప్రయత్నం కూడా మార్క్‌రమ్ చేయలేదు. చూస్తూ నిలబడిపోయాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. షమర్ జోసెఫ్ ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 160 పరుగులకు కుప్పకూలింది. యువ ప్లేయర్ డేన్ పైడెట్(60 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38 నాటౌట్) అజేయంగా నిలవగా.. బెడింగ్‌హామ్(28), ట్రిస్టన్ స్టబ్స్(26), వెర్రెన్(21) పోరాడే ప్రయత్నం చేశారు.

సౌతాఫ్రికా బౌలర్లలో షమర్ జోసెఫ్‌తో పాటు జైడెన్ సీల్స్(3/45), మోతీ(1/28), హోల్డర్(1/26) తలో వికెట్ తీసారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 28.2 ఓవర్లలో 7 వికెట్లకు 97 పరుగులే చేసింది. కీసీ కార్టీ(26), జాసన్ హోల్డర్(33 బ్యాటింగ్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంకా వెస్టిండీస్ 63 పరుగుల వెనుకంజలో ఉంది. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ మల్డర్(4/18) నాలుగు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రా అయ్యింది.

Story first published: Friday, August 16, 2024, 12:04 [IST]
Other articles published on Aug 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+