Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WI vs SA: 7 సిక్సర్లతో నికోలస్ పూరన్ విధ్వంసం.. సూరీడు రికార్డు బద్దలు!

వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్(26 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 నాటౌట్) మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో శనివారం జరిగిన తొలి టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు.

7 సిక్స్‌లతో వీరవిహారం చేసిన నికోలస్ పూరన్.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌లను అధిగమించాడు.

WI vs SA Nicholas Pooran surpasses Suryakumar Yadav in most 6s list in T20Is

ఇప్పటి వరకు 96 టీ20లు ఆడిన నికోలస్ పూరణ్.. 139 సిక్స్‌లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 205 సిక్స్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ స్టార్ మార్టిన్ గప్టిల్ 173 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. జోస్ బట్లర్ 137, సూర్యకుమార్ యాదవ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు.

టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు..
రోహిత్ శర్మ-159 టీ20ల్లో 205 సిక్స్‌లు

మార్టిన్ గప్టిల్- 122 టీ20ల్లో 173 సిక్స్‌లు

జోస్ బట్లర్-124 టీ20ల్లో 137 సిక్స్‌లు

సూర్యకుమార్ యాదవ్- 71 టీ20ల్లో 136 సిక్స్‌లు

వెస్టిండీస్ విజయం..
నికోలస్ పూరన్ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్(42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76), పాట్రిక్ క్రుగెర్(44) రాణించారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(26 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65), షైహోప్(36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Saturday, August 24, 2024, 21:26 [IST]
Other articles published on Aug 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+