For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WI vs PAK: రిప్లేలో మ్యూజిక్ లిస్ట్ చూపించిన థర్డ్ అంపైర్! ఫ్యాన్స్ సెటైర్స్!(వీడియో)

WI vs PAK: Third umpire mistakenly shows music playlist on big screen in First Test
Third Umpire Shows Music Playlist On Big Screen During WI vs PAK Test | Oneindia telugu

కింగ్‌స్టన్(జమైకా): కరేబియన్ గడ్డపై జరుగుతున్న వెస్టిండీస్-పాకిస్థాన్ రెండు టెస్ట్‌ల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల ముగిసిన ఫస్ట్ టెస్ట్‌లో విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కింది. ఫలితంగా ఆతిథ్య జట్టు 1-0తో పాక్‌పై ఆధిక్యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అసలు ఆ విషయం ఏంటంటే.. వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా థర్డ్ అంపైర్ చేసిన తప్పిదం. ఇన్నింగ్స్ 77వ ఓవర్‌లో విండీస్ సారథి క్రైగ్ బ్రాత్‌వైట్ రనౌట్ కోసం ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. అతను రీప్లే‌ను పరిశీలించే క్రమంలో తన కంప్యూటర్‌లోని మ్యూజిక్ లిస్ట్‌ను ప్లే చేశాడు. బిగ్ స్క్రీన్‌పై దీన్ని చూసిన అభిమానులు, ఆటగాళ్లు అవాక్కయ్యారు. బ్రాత్ వైట్ 97 పరుగుల వద్ద ఉండటంతో థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం అందరూ ఆతృతగా చూస్తుండగా.. అంపైర్ మ్యూజిక్ లిస్ట్ ప్లే చేయడంతో అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత అతను ఔటని తేలగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియోపై అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇంకా నయం మ్యూజిక్ లిస్ట్ ప్లే చేశాడు.. అది కాకుండా వేరే ప్లే చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని సెటైర్లు పేల్చుతున్నారు.

ఈ మ్యాచ్‌లో పాక్‌ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో విండీస్ తడబడింది. 142 పరుగులకే 8 వికెట్లు కోల్పయి ఓటమి అంచున నిలిచింది. కానీ బౌలర్ కీమర్ రోచ్ ( 52 బంతుల్లో 2 ఫోర్లతో 30 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. జోమెల్ వారికన్ (6), జేడెన్ సీల్స్ (2) అండతో రోచ్ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించి చిరస్మరణీయ విజయాన్నందించాడు. రెండో టెస్ట్ ఆగష్టు 20న కింగ్‌స్టన్ వేదికగానే జరగనుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే ఆలౌటైంది. అనంతరం వెస్టిండీస్ బ్రాత్ వైట్(97)ఇన్నింగ్స్ సాయంతో 253 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 203 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మొహ్మద్ రిజ్వాన్ (30), ఫహీమ్ అష్రాఫ్ (20), అసన్ అలీ (28) పరుగులు చేశారు. విండీస్ పేసర్‌ జేడెన్‌ సీల్స్‌ (5/55) ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో విండీస్‌ తరఫున 5 వికెట్ల ఫీట్‌ సాధించి పిన్న వయసు బౌలర్‌గా 19 ఏళ్ల సీల్స్‌ రికార్డులకెక్కాడు.

Story first published: Wednesday, August 18, 2021, 14:40 [IST]
Other articles published on Aug 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+