Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WI vs PAK: ఫవాద్ అలామ్ అజేయ సెంచరీ.. పాకిస్థాన్ భారీ స్కోర్! మూడు వికెట్లు కోల్పోయిన విండీస్!

 WI vs PAK: Fawad Alams century shaheen afridis twin strikes put visitors on top

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌‌లో పాకిస్థాన్ భారీ స్కోర్ చేసింది. ఫవాద్ అలామ్(213 బంతుల్లో 17 ఫోర్లతో 124 నాటౌట్) అజేయ సెంచరీకి కెప్టెన్ బాబర అజామ్(174 బంతుల్లో 13 ఫోర్లతో 75) అర్థశతకం తోడవడంతో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 302/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇద్దరికి జతగా మహమ్మద్ రిజ్వాన్(115 బంతుల్లో 31), ఫహీమ్ అష్రఫ్ (78 బంతుల్లో 28) క్రీజులో నిలబడి రాణించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జైడన్ సీల్స్ మూడేసి వికెట్లు తీయగా.., జాసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్లకు 39 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రైగ్ బ్రాత్ వైట్(4), కీరన్ పోవెల్(5), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోస్టన్ చేజ్(10) తీవ్రంగా నిరాశపర్చగా.. క్రీజులో బోన్నర్(18 బ్యాటింగ్), అల్జారీ జోసెఫ్(0 బ్యాటింగ్) ఉన్నారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. ఫహీమ్ అష్రఫ్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఇక ఈ మ్యాచ్‌ను వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. తొలి రోజు కొన్ని ఓవర్ల ఆటకు అంతరాయం కలగగా.. రెండో రోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మూడో రోజైన ఆదివారం కూడా ఆటకు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. ఉదయం సెషన్‌లో కురిసిన వర్షంతో ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో లంచ్‌ వరకు మైదానంలో 8 బంతులే పడ్డాయి. పర్యాటక జట్టు పరుగులేమీ చేయలేదు. లంచ్ సెషన్ తర్వాత మైదానం సిద్దమవడంతో పాక్ 221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఆదిలోనే ఫహీమ్ అష్రఫ్ వికెట్ కోల్పోయినా.. మహమ్మద్ రిజ్వాన్, హసన్ అలీ(9), షాహిన్ షా(19)తో కలిసి ఫవాద్ అలామ్ జట్టు స్కోర్‌ను 300 ధాటించాడు. ఇక చివరి సెషన్ ముంగిట వ్యూహాత్మకంగా డిక్లెర్ ఇచ్చిన పాక్.. ఆశించిన ఫలితాన్ని రాబట్టింది.

ఆదిలోనే విండీస్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చింది. దాంతో విండీస్ 30/2తో డ్రింక్స్ బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత మరో వికెట్ తీసిన పాక్.. విండీస్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో ఆతిథ్య జట్టును బ్యాడ్ లైట్ రక్షించింది. బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు ఆటను ముందుగానే ముగించారు.

సంక్షిప్త స్కోర్లు

పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 302/9 డిక్లేర్డ్ (ఫవాద్ అలామ్ 124 నాటౌట్, బాబర్ జామ్ 75)

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 39/3

Story first published: Monday, August 23, 2021, 9:06 [IST]
Other articles published on Aug 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+