పాకిస్థాన్ మూడేళ్ల ముచ్చట తీర్చిన బాబర్ ఆజామ్!
టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ తమ పరాజయాల పరంపరకు తెరదించింది. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విదేశాల్లో పాకిస్థాన్ తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం ముగిసిన రెండో టెస్ట్‌లో బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 1-1తో సమం చేసింది. వరుసగా 8 విదేశీ టెస్ట్ పరాజయాల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది.
పాకిస్థాన్ చివరిసారిగా.. 2023 జూలైలో శ్రీలంక పర్యటనలో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ గెలిచినా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. 75 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 23.3 ఓవర్లలో 2 వికెట్లకు 77 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు అజాన్ అవైస్(18), ఇమామ్ ఉల్ హక్(9) విఫలమైనా.. అబ్దుల్లా షఫీక్(24 నాటౌట్), బాబర్ ఆజామ్(24 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగుల ఆధిక్యం సాధించడం పాకిస్థాన్ విజయానికి కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్(73), రోస్టన్ ఛేజ్(70) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్(4/85) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ అలీ(2/67),ఉబైద్ షా(2/66), అలీ ఉస్మాన్(2/80) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్(323 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 160) సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజామ్(147 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 88) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్(6/112) ఆరు వికెట్లు తీయగా.. షమార్ జోసెఫ్(2/84) రెండు వికెట్లు పడగొట్టగా.. జైడన్స్ సీల్స్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు కుప్పకూలింది. కావెమ్ హోడ్జ్(34) మినహా అంతా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్ నాలుగేసి వికెట్లు తీసారు. మహమ్మద్ అలీకి ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

