Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WI vs NZ: పాపం వెస్టిండీస్.. న్యూజిలాండ్ చేతిలోనూ ఓటమే! చెలరేగిన కేన్ మామ!

WI vs NZ: Santner and Neesham helps New Zealand open with 13-run victory against West Indies

కింగ్‌స్టన్: వెస్టిండీస్ క్రికెట్ టీమ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ప్రత్యర్థి మారినా ఫలితం మాత్రం మారడం లేదు. సొంతగడ్డపై భారత్ చేతిలో వన్డే, టీ20 సిరీస్‌లో ఖంగుతిన్న నికోలస్ పూరన్ సేన.. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లోనే 13 పరుగులతో ఓటమిపాలైంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిచెల్ సాంట్నర్ స్పిన్ దెబ్బకు కుదేలు అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది.

అదరగొట్టిన కేన్ మామ..

కెప్టెన్ కేన్ విలియమ్సన్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. డేవాన్ కాన్వే(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) పర్వాలేదనిపించాడు. కేన్ మామకు ఈ ఏడాది ఇదే తొలి టీ20 మ్యాచ్ కావడం విశేషం. గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న అతను సుదీర్ఘ విరామం అనంతరం బరిలోకి దిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే రాణించాడు. చివర్లో జేమ్స్ నీషమ్(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 నాటౌట్) ధాటిగా ఆడటంతో కివీస్ భారీ స్కోర్ చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ మూడు వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్, ఒబెడ్ మెక్‌కామ్ తలో వికెట్ పడగొట్టారు.

స్మిత్ పోరాడినా..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. షమర్ బ్రూక్స్(43 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రొమారియో షెఫర్డ్(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 31 నాటౌట్), ఓడియన్ స్మిత్ (12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్), జాసన్ హోల్డర్(19 బంతుల్లో 3 ఫోర్లతో 25) రాణించినా ఫలితం లేకపోయింది. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/19) మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోదీ తలో వికెట్ తీసారు.

బుమ్రా,కోహ్లీ ఫామ్‌లో లేరు ఎలా మరి *Cricket | Telugu OneIndia India Will Win Asia Cup Without Bumrah

జిమ్మీ నీషమ్ సూపర్ ఫీల్డింగ్..

చివర్లో షెఫర్డ్, ఓడియన్ స్మిత్ పోరాడినా ఫలితం లేకపోయింది. చేయాల్సిన పరుగులు ఎక్కువ ఉండటంతో లక్ష్యాన్ని చేధించలేకపోయారు. ఆఖరి ఓవర్‌లో విండీస్ విజయానికి 26 పరుగులు అవసరమవ్వగా.. షెఫర్డ్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. కానీ టీమ్ సౌథీ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సూపర్ ఫీల్డింగ్ తోడవడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు. ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద జేమ్స్ నీషమ్ ఆపిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

Story first published: Thursday, August 11, 2022, 8:32 [IST]
Other articles published on Aug 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+