Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WI vs ENG: మార్క్ వుడా? మజాకా ... మైదానం మొత్తం నవ్వులే నవ్వులు(వీడియో)

WI vs ENG: Mark Wood hilariously comes up with solo huddle goes viral

నార్త్‌సౌండ్: వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మైదానంలో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ చేసిన ఓ పని అభిమానులను కడపు చక్కలయ్యేలా నవ్వించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. మార్క్ వుడ్ చేసిన పనికి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా బ్రేక్‌ సమయంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లంతా ఒక ​దగ్గరకు చేరి గేమ్‌ స్ట్రాటజీని చర్చించారు.

జో రూట్‌ ఆధ్వర్యంలోని జట్టు మొత్తం ఒక దగ్గర ఉంటే.. బౌలర్‌ మార్క్‌ వుడ్‌ మాత్రం వారికి వ్యతిరేక దిశలో ఫైన్‌లెగ్‌లో నిలబడ్డాడు. వారి దగ్గరకు పరుగెత్తడం ఎందుకులే అనుకున్నడో ఏమో కానీ అక్కడే నిలబడిపోయాడు. జోరూట్ కూడా అతన్ని పిలవలేదు.

అయితే తన సహచరులంతా ఒకచోట చేరి మ్యాచ్ వ్యూహాలను చర్చించుకుంటూ ఉంటే.. మార్క్‌వుడ్ మాత్రం దూరంగా ఉండిపోయాడు. కొద్దిసేపు అలానే నిలబడిపోయిన అతను.. ఏమనుకున్నాడో ఏమో తెలియదు కాని.. వెంటనే తన రెండు చేతులను పైకి లేపి.. సహచరులతో కలిసి గేమ్‌ప్లాన్‌ చర్చలో పాల్గొన్నట్లు ఒక సిగ్నేచర్‌ ఇచ్చాడు. అది తాను ఉన్న స్థానం నుంచే.. ఇది చూసిన అభిమానులు నవ్వుకోవడమేగాక.. మార్క్‌ వుడ్‌ చర్యను అభినందిస్తూ కామెంట్స్‌ చేశారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ 66.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. జాసన్‌ హోల్డర్‌(43 బ్యాటింగ్), క్రుమ్హా బొనర్‌ (34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు వద్ద ఆలౌటైంది. జానీ బెయిర్‌ స్టో (140) సెంచరీ చేలరేగాడు. విండీస్‌ బౌలర్లలో జైడెన​ సీల్స్‌ 4, కీమర్‌ రోచ్‌, హోల్డర్‌, అల్జారీ జోసెఫ్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఇక వెస్టిండీస్ ఇంకా 109 పరుగుల వెనుకంజలో ఉంది. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో చిత్తుగా ఓడిన ఆసీస్.. ఈ సిరీస్ గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంటుంది.

Story first published: Thursday, March 10, 2022, 14:55 [IST]
Other articles published on Mar 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+