Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WI vs ENG: మలుపు తిప్పిన స్టన్నింగ్ క్యాచ్.. విండీస్ సంచలన విజయం!(వీడియో)

సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టీండీస్ 2-1తో కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఆఖరి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ బ్రాండన్ కింగ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆహా.. ఏమీ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బ్రాండన్ కింగ్ స్టన్నింగ్ క్యాచ్‌కు ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(108 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 74) పెవిలియన్ చేరాడు. మాథ్యూ ఫోర్డే వేసిన 41వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

WI vs ENG Brandon King stunning catch help West Indies thrash England to clinch series- Watch

ఈ ఓవర్ మూడో బంతిని ఔట్‌ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా లెంగ్త్‌లో వేయగా.. ఫిల్ సాల్ట్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బ్రాండన్ కింగ్ వెనక్కి వంగి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. సమన్వయం కోల్పోవడంతో చాకచక్యంగా సమీపంగా ఉన్న అల్జారీ జోసెఫ్‌కు బంతిని అందించాడు. అతను ఏ తప్పిదం చేయకుండా క్యాచ్‌ను పూర్తి చేశాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు ఫిల్ సాల్ట్ బిత్తరపోయాడు.

సెంచరీ దిశగా సాగిన అతని ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 263 పరుగులే చేసింది. ఫిల్ సాల్ట్‌తో పాటు డాన్ మౌస్లీ(70 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో జోఫ్రా ఆర్చర్(17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే(3/35) మూడు వికెట్లు తీయగా.. రోమారియో షెఫర్డ్(2/33), అల్జారీ జోసెఫ్(2/45) రెండేసి వికెట్లు పడగొట్టారు. రోస్టన్ చేజ్(1/42) ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 43 ఓవర్లలోనే 2 వికెట్లకు 267 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. బ్రాండన్ కింగ్(117 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 102), కీసీ కార్టీ(114 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 128 నాటౌట్) సెంచరీలతో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టోప్లీ, జామీ ఓవర్టన్ తలో వికెట్ తీసారు. స్టన్నింగ్ క్యాచ్‌తో పాటు సెంచరీతో చెలరేగిన బ్రాండన్ కింగ్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Story first published: Thursday, November 7, 2024, 10:00 [IST]
Other articles published on Nov 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+