For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WI vs AUS: క్రిస్ గేల్ సిక్సర్ల వర్షం.. చిత్తయిన ఆస్ట్రేలియా.. సిరీస్ విండీస్ కైవసం!

 WI vs AUS: Chris Gayle shines as West Indies Seal T20I Series Against Australia

గ్రాస్ ఇస్లెట్: వెస్టిండీస్ గడ్డపై ఆస్ట్రేలియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. యూనివర్స బాస్ క్రిస్ గేల్(38 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67) పరుగుల విధ్వంస సృష్టించడంతో సోమవార అర్థరాత్రి ధాటక జరిగిన మూడో టీ20లో విండీస్ 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు టీ20ల సిరీస్‌ను 3-0తో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. ఇక నామమాత్రమైన నాలుగో టీ20 మ్యాచ్ బుధవారం జరగనుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (31 బంతుల్లో 2ఫోర్లతో 30), హెన్రిక్స్ ( 29 బంతుల్లో 2 సిక్స్‌లతో 33) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ (9), మాథ్యూవెడ్ (23), అలెక్స్ క్యారీ (13) తీవ్రంగా నిరాశపరిచారు. వెస్టిండీస్ బౌలర్లలో హెడెన్ వాల్ష్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫాబియెన్ అలెన్, డ్వేన్ బ్రావో, ఒబెడ్ మెకాయ్ తలో వికెట్ తీశారు.

142 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 14.5 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అయితే విండీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఆండ్రీ ఫ్లెచర్ (4), లెండిల్ సిమన్స్ (15) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ బాట పట్టారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గేల్ ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. నాలుగు ఫోర్లు, 7 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీ బాది విండీస్‌ విజయాన్ని సులువు చేశాడు. నికోలస్ పూరన్ (32)తో కలిసి మూడో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన క్రిస్‌గేల్.. టీమ్ స్కోరు 109 వద్ద ఔటైపోయాడు. అయితే అప్పటికే మ్యాచ్‌ పూర్తిగా వెస్టిండీస్ చేతుల్లోకి వచ్చేయగా.. డ్వేన్ బ్రావో (7 నాటౌట్), ఆండ్రీ రసెల్ (7 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో రిలే మెరాడిత్ మూడు వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ ఒక వికెట్ తీశాడు.

Story first published: Tuesday, July 13, 2021, 11:10 [IST]
Other articles published on Jul 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+