Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WI vs AUS: నిప్పులు చెరిగిన హజెల్ వుడ్.. ఆస్ట్రేలియా ఘన విజయం

వెస్టిండీస్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శుక్రవారం ముగిసిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 26 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 6.4 ఓవర్లలో చేధించింది. ఉస్మాన్ ఖవాజా(9) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా.. స్టీవ్ స్మిత్(11 నాటౌట్), మార్నస్ లబుషేన్(1 నాటౌట్) ఆసీస్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.

అంతకుముందు 73/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ 120 పరుగులకు ఆలౌటైంది. జోష్ హజెల్ వుడ్(5/35) ఐదు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ రెండేసి వికెట్లు తీసారు. కామెరూన్ గ్రీన్ ఓ వికెట్ పడగొట్టాడు.

 WI vs AUS: Australia beat West Indies Australia won by 10 wickets in 1st Test

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది. ప్యాట్ కమిన్స్(4/41), జోష్ హజెల్ వుడ్(4/44) నాలుగేసి వికెట్లతో వెస్టిండీస్ పతనాన్ని శాసించారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్(134 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119) సెంచరీతో 283 పరుగులు చేసింది. షామర్ జోసెఫ్(5/94) ఐదు వికెట్లు తీయగా.. కెమర్ రోచ్(2/48), జస్టిన్ గ్రేవ్స్(2/36) రెండేసి వికెట్లు తీసారు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. సెంచరీతో రాణించిన ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Story first published: Friday, January 19, 2024, 18:42 [IST]
Other articles published on Jan 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+