Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు.. ఎందుకంటే?

ఐర్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన భారత్ 34 పరుగుల తేడాతో ఓడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేకపోయింది. 148 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత్ జట్టులో అభిషేక్ శర్మ మినహా అంతా విఫలమయ్యారు.

అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ అనూహ్యంగా రద్దయ్యింది. ఐర్లాండ్ బౌలర్ లియామ్ మెక్‌కార్తీ వేసిన 8వ ఓవర్‌లో సింగిల్ తీయడం ద్వారా అభిషేక్ శర్మ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ సమయంలో అభిషేక్ శర్మ స్కోర్‌ను 50 గా చూపించడంతో అతను సెలెబ్రేట్ చేసుకున్నాడు. భారత ఆటగాళ్లు కూడా డగౌట్‌లో నిలబడి అభిషేక్‌ను అభినందించాడు.

Why Was Abhishek Sharma Half-Century Cancelled In 1st T20I against Ireland

లెగ్‌బైతో హాఫ్ సెంచరీ మిస్..

ఆ మరుసటి బంతికే డీప్ మిడ్ వికెట్‌లో బెంజమిన్ కల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలోనూ స్కోర్ కార్డులో అభిషేక్ శర్మ స్కోర్‌ను 20 బంతుల్లో 50 పరుగులుగా చూపించారు. అయితే రెండో ఓవర్‌లో లెగ్ బై సవరణ కారణంగా అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ కాస్త 49 పరుగులుగా మారింది.

భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఐర్లాండ్ పేసర్ జయ్ మూంద్రా వేసిన ఆఖరి బంతి షార్ట్ ఫైన్ లెగ్ వైపు వెళ్లగా అభిషేక్ శర్మ సింగిల్ తీసాడు.ఆన్ ఫీల్డ్ అంపైర్ దానిని బ్యాట్‌కు తగిలిన పరుగుగా ప్రకటించాడు. కానీ అది లెగ్ బై అని తేలడంతో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ నుంచి ఆ పరుగును తొలగించారు. దాంతో అతని హాఫ్ సెంచరీ కాస్త 49 పరుగులకు తగ్గింది.

అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం..

183 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. సంజూ శాంసన్(5), ఇషాన్ కిషన్(1), శ్రేయస్ అయ్యర్(3) పవర్ ప్లేలోనే వెనుదిరిగినా తనదైన శైలిలో బ్యాటింగ్‌తో చెలరేగాడు. కానీ అతన్ని మెక్‌కార్తీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి భారత్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత తిలక్ వర్మ(21 బంతుల్లో 3 ఫోర్లతో 19), వాషింగ్టన్ సుందర్(12 బంతుల్లో 9) విఫలమవ్వగా.. శివమ్ దూబే(25) కాస్తా పోరాడాడు.

కానీ ఐర్లాండ్ బౌలర్లు అవకాశం ఇవ్వకుండా వరుసగా వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. 11 ప్రయత్నాల తర్వాత భారత్‌ను ఓడించి ఐర్లాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.

Story first published: Saturday, June 27, 2026, 18:39 [IST]
Other articles published on Jun 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+