ఆ మాటతోనే వైభవ్ సూర్యవంశీకి కొపమొచ్చింది!
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ఇప్పటి వరకు తనదైన దూకుడుతో అందర్నీ ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ.. మ్యాచ్ ఓడిపోయిన సందర్భాల్లో కన్నీటి పర్యంతమై తన అమాయకత్వాన్ని చాటుకున్నాడు. అయితే తాజాగా తన ఉగ్రరూపాన్ని చూపించాడు.
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఏతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్-ఏ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది. సూపర్ ఓవర్ ముగిసిన అనంతరం బయటకు వెళ్లే సమయంలో వైభవ్ సూర్యవంశీని శ్రీలంక ఆటగాళ్లు ఏదో అనగా.. అతను వారిపైకి దూసుకెళ్లాడు.
ఓ ఆటగాడిని తన చేతులతో నెట్టేసాడు. అంపైర్లు, శ్రీలంక వికెట్ కీపర్ జోక్యం చేసుకొని ఇద్దర్ని విడదీసారు. అమాయకంగా కనిపించే వైభవ్ సూర్యవంశీ ఇలా ఆగ్రహావేశాలకు లోనవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఈ మ్యాచ్ ఆసాంతం వైభవ్ ఇలానే కనిపించాడు. కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. వైభవ్ తీరును మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. అయితే శ్రీలంక-ఏ ఆటగాడు హలంబాగే అవహేళన చేసినట్లు మాట్లాడటంతోనే వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి గురయ్యాడని తెలుస్తోంది.
'మ్యాచ్ ముగిసింది.. ఇక నువ్వు ఇంటి వెళ్లు'అని హలంబాగే అనడంతోనే వైభవ్‌కు కోపమొచ్చిందని జాతీయ మీడియా పేర్కొంది. ఈ మాటలతోనే సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాడి చాతిపై చేయి వేసి తోసేయడానికి ప్రయత్నించాడు. సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని వైభవ్ సూర్యవంశీని శాంతింపజేశారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటవ్వగా.. శ్రీలంక-ఏ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులే చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. దాంతో అంపైర్లు సూపర్ ఓవర్‌తో మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఏ 16 పరుగులు చేయగా.. భారత్-ఏ 10 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఈ ముక్కోణపు సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications