Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC 2027: అఫ్గాన్‌పై భారీ విజయం.. టీమిండియాకు నో యూజ్! ఎందుకంటే..?

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌లో టీమిండియా రికార్డ్ విజయాన్ని అందుకుంది. 94 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరుగని విజయాన్ని కైవసం చేసుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో సోమవారం ముగిసిన ఏకైక టెస్ట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత్‌కు ఇది అతిపెద్ద విజయం.

అయితే ఈ భారీ విజయంతో భారత్‌కు ఒరిగేదేం లేదు. ఆల్‌టైమ్ రికార్డ్ విజయాన్ని అందుకున్నా.. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ స్థానం ఏ మాత్రం మారదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2025-27 సైకిల్‌లో భాగం కాదు. అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌కు ప్రోత్సాహం అందించే ఉత్తిత్తి మ్యాచ్. దాంతోనే ఈ గెలుపుతో టీమిండియాకు ఉపయోగం లేకుండా పోయింది.

IND vs AFG: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..!

IND vs AFG: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..!

డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం భారత్ 48.15 విన్నింగ్ పర్సంటేజ్‌తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ సైకిల్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన భారత్ 4 గెలిచి మరో నాలుగు ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. గతేడాది ఇంగ్లండ్ పర్యటనతో డబ్ల్యూటీసీ సైకిల్‌‌ను ప్రారంభించిన భారత్.. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.

Why the WTC 2027 Points Table Remains Unchanged Despite India s Record-Breaking Innings Victory Over Afghanistan

ఆ తర్వాత వెస్టిండీస్‌తో సొంతగడ్డపై 2 టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కానీ సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ అయ్యింది. ఈ ఘోర పరాజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. భారత్ కంటే ముందు స్థానాల్లో కొనసాగుతుున్నాయి.

ఈ సైకిల్‌లో భారత్ ఇంకా 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శ్రీలంకలో రెండు, న్యూజిలాండ్‌లో రెండు, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల్లో టీమిండియా తలపడాలి. ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ 9 మ్యాచ్‌ల్లో కనీసం ఏడు గెలవాలి. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చివరిసారిగా 2009లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అక్కడే జరిగే మ్యాచ్‌లు భారత జట్టుకు పెద్ద సవాల్‌గా మారనున్నాయి. ఈ 9 మ్యాచ్‌లకు సన్నాహకంగానే టీమిండియా అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడింది.

IND vs AFG: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్? గంభీర్ ఏమన్నాడంటే..?

IND vs AFG: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్? గంభీర్ ఏమన్నాడంటే..?
Story first published: Monday, June 8, 2026, 17:50 [IST]
Other articles published on Jun 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+