IND vs SL: శ్రీలంకకు అప్పనంగా 10 పరుగులు.. ఎందుకంటే?
ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే శ్రీలంక ఏ స్కోర్ బోర్డుకు 10 పరుగులు జతయ్యాయి. ఒక్క బంతి పడకుండానే శ్రీలంక స్కోర్ 10 పరుగులకు చేరడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్ ఏతో దంబుల్లా వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. సూర్యన్ష్ షెడ్గే(66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72), విప్రజ్ నిగమ్(49 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు.
వైభవ్ సూర్యవంశీ(21), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(11), రుతురాజ్ గైక్వాడ్(37), తిలక్ వర్మ(23), ఆయుష్ బదోని(15), నిషాంత్ సింధు(6) దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక ఏ బౌలర్లలో మహమ్మద్ షిరాజ్(3/33), విజయ్‌కాంత్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. సహాన్, వనుజ సహన్, మతులన్ తలో వికెట్ తీసారు.

అప్పనంగా 10 రన్స్.. ఎందుకంటే?
అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా.. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే ఆ జట్టు స్కోర్ 10/0కు చేరింది. బ్యాటింగ్ సమయంలో భారత్ ఏ ఆటగాళ్లు పిచ్‌పై నిషేదిత ప్రాంతంలో పదేపదే పరుగెత్తడంతో అంపైర్లు 10 పరుగులు పెనాల్టీ విధించారు. భారత ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో ఆల్‌రౌండర్ అనుకూల్ రాయ్ పిచ్ మధ్యలో పరుగెత్తడంతో అంపైర్లు వార్నింగ్ ఇచ్చారు.
రెండు ఓవర్ల తర్వాత విప్రజ్ నిగమ్ అదే తప్పును పునరావృతం చేశాడు. అప్పుడు అంపైర్లు రెండోసారి వార్నింగ్ ఇచ్చారు. 37వ ఓవర్‌లో నిగమ్ మళ్లీ అదే తప్పును రిపీట్ చేయడంతో అంపైర్లు రూల్స్ ప్రకారం 10 పరుగులు పెనాల్టీ విధించారు. అయితే ఈ పెనాల్టీ 10 పరుగులు భారత్ ఓటమిని శాసించే అవకాశం ఉంది.
ఐసీసీ రూల్స్ ఏంటంటే..?
ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా కానీ.. అనుకోకుండా గానీ పిచ్‌లోని రక్షిత ప్రాంతంలోకి పరుగెత్తకూడదు. ఇలాంటి తప్పిదం చేస్తే తొలిసారి హెచ్చరికతో వదిలేస్తారు. ఇలాంటి తప్పును పదే పదే చేస్తే.. ప్రతి తప్పిదానికి 5 పరుగుల చొప్పున పెనాల్టీ విధిస్తారు. దాంతోనే శ్రీలంకకు అప్పనంగా 10 పరుగులు వచ్చాయి. ఆటగాళ్ల షూలకు ఉండే స్పైక్స్ పిచ్ ఉపరితలాన్ని దెబ్బతీసి, గరకు ప్రాంతాలను సృష్టిస్తాయి. ఇది మ్యాచ్ ఫలితాన్ని, పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ కఠిన నిబంధనలను తీసుకొచ్చారు.
ఇక్కడ భారత ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే పరుగెత్తినట్లు కనిపిస్తోంది. పిచ్ ఉపరితలాన్ని దెబ్బతీస్తే స్పిన్‌కు అనుకూలంగా మారుతుందనే వ్యూహంతో ఇలా చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

