Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విషయంలో బెన్ట్ స్టోక్స్‌దే తప్పు: సచిన్ టెండూల్కర్

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్ -సచిన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో బెన్ స్టోక్స్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీకి చేరువైన టీమిండియా ఆల్‌రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలను డ్రాకు అంగీకరించాలని బెన్ స్టోక్స్ ఒత్తిడి చేశాడు. దానికి అంగీకరించకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బెన్ స్టోక్స్ నోరు పారేసుకున్నాడు.

హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్‌లో సెంచరీ చేస్తారా? అని హేళనగా మాట్లాడాడు. సెంచరీలు అనంతరం భారత్ డ్రాకు అంగీకరించినా.. జడేజాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా స్టోక్స్ అసహనం వ్యక్తం చేశాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన స్టోక్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Why Should We Give Them Rest Sachin Tendulkar Blasts Ben Stokes amp amp Defends India s Non-Declaration

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఘటన గురించి మాట్లాడిన సచిన్.. బెన్ స్టోక్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ముమ్మాటికి అతనిదే తప్పన్నాడు. 'వాషింగ్టన్ సుందర్, జడేజా సెంచరీలు సాధించారు. ఇందులో క్రీడా స్ఫూర్తికి విరద్దంగా ప్రవర్తించడం ఏం ఉంది? ఈ ఇద్దరూ డ్రా కోసం గొప్ప పోరాటం చేశారు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అప్పటికీ సిరీస్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. అలాంటి సమయంలో భారత ఆటగాళ్లు డ్రాకు ఎందుకు అంగీకరించాలి. ఇంగ్లండ్ ఆటగాళ్లకు వారు ఎందుకు విశ్రాంతి ఇవ్వాలి?

హ్యారీ బ్రూక్‌తో బౌలింగ్ చేయాలనేది బెన్ స్టోక్స్ ఇష్టం. అది భారత్ సమస్య కాదు. నా వరకైతే జడేజా, సుందర్ చేసింది సరైనదే. వారు సెంచరీల కోసం కాకుండా డ్రా కోసం ఆడారు. ఆ పోరాటానికి ఫలితంగా శతకాలు దక్కాయి. వారు ఆరంభంలోనే ఔటై ఉంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచేది కాదు. వారు బ్యాటింగ్‌కు వచ్చిన కొత్తలో హ్యారీ బ్రూక్ బౌలింగ్ చేయలేదు కదా..? ఇందుకు ఇంగ్లండ్ వద్ద సమాధానం ఉందా?

ఈ విషయంలో భారత జట్టుకు 100 శాతం మద్దతు ఇస్తాను. అది గంభీర్, శుభ్‌మన్, జడేజా, వాషింగ్టన్ ఎవరైనా సరే.. వారికి నా మద్దతు ఉంటుంది. గత మ్యాచ్‌లో సుందర్ అద్భుతంగా ఆడాడు కదా? వేగంగా ఆడాల్సినప్పుడు ఆ బాధ్యతను పూర్తి చేశాడు.'అని సచిన్ ప్రశంసించాడు.

Story first published: Wednesday, August 6, 2025, 18:02 [IST]
Other articles published on Aug 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+