Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కలేదు!

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీ) ప్రకటించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్‌ల్లో యువ ప్లేయర్లు ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కలేదు. అరంగేట్ర సిరీస్‌లోనే మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న ఈ ఇద్దరి ఆటగాళ్లపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌తో ఈ ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన ఫస్ట్ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు బాదగా.. ధ్రువ్ జురెల్(46) పర్వాలేదనిపించాడు. నాలుగో టెస్ట్‌లో సర్ఫరాజ్ ఖాన్ విఫలమైనా.. ధ్రువ్ జురెల్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేశాడు.

Why Sarfaraz Khan and Dhruv Jurel

క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చి టెయిలెండర్లతో అసాధారణ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నా.. తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ములుపు తిప్పాడు. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లోనూ నిలకడగా బ్యాటింగ్ చేసి భారత విజయ లాంఛాన్ని పూర్తి చేశాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ జురెల్ మరో ధోనీ అవుతాడని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు ప్రశంసించారు. అలాంటి జురెల్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు దక్కలేదు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారమే వారికి అవకాశం దక్కలేదు. బీసీసీఐ రూల్స్ ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే భారత్ తరఫున 3 టెస్ట్‌లు లేదా 8 వన్డేలు, 10 టీ20లు ఆడాలి. ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ రెండు టెస్ట్‌లు మాత్రమే ఆడారు. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్ట్‌లో ఈ ఇద్దరూ బరిలోకి దిగితే.. మూడు టెస్ట్‌లు పూర్తి చేసుకుంటారు. అప్పుడు వీరికి సీ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కనుంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంట్రాక్ట్‌లపై బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2023-24 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్లు:

గ్రేడ్ ఏ ప్లస్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్ ఏ: అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా

గ్రేడ్ బీ: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్

గ్రేడ్ సీ: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, రజత్ పాటిదార్.

Story first published: Wednesday, February 28, 2024, 21:49 [IST]
Other articles published on Feb 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+