Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే రోహిత్ శర్మ రిటైర్మెంట్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బుధవారం సింపుల్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన నిర్ణయాన్నివెల్లడించాడు. 'అందరికీ నమస్కారం.. నేను టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నా. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో నాపై చూపించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతాను.'అని రోహిత్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

ఆకస్మాత్తుగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు షాకయ్యారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మ తప్పించేందుకు సెలెక్టర్లు సిద్దమయ్యారని బుధవారం జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన కాసేపటికే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెలెక్టర్ల నిర్ణయం నచ్చకనే రోహిత్ శర్మ.. వీడ్కోలు పలకాడనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

Why Rohit Sharma Retired from Test Cricket Ahead of India Tour Of England

ఇంగ్లండ్ పర్యటనతో..
వాస్తవానికి టెస్ట్ ఫార్మాట్‌‌లో ఇంకొన్నాళ్లు కొనసాగాలని రోహిత్ శర్మ భావించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లండ్ పర్యటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సిరీ‌స్‌లో టీమిండియా రాణించాలంటే.. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ ఫిట్‌గా ఉండటం కీలకమని చెప్పాడు. తన రిటైర్మెంట్‌పై వచ్చిన ఊహాగానలపై కూడా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల రిటైర్మెంట్‌ను పెన్ను, పేపర్‌ పట్టుకొని ఖరారు చేయలేరని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతారని అంతా అనుకున్నారు.

టెస్ట్ కెప్టెన్సీ‌పై వేటు..?
అయితే రోహిత్ శర్మతో టచ్‌లో ఉన్న సెలెక్టర్లు.. అతన్ని టెస్ట్ ఫార్మాట్‌‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించినట్లు ఓ నేషనల్ వెబ్‌సైట్ పేర్కొంది. కేవలం ఆటగాడిగా మాత్రమే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం నచ్చని రోహిత్ శర్మ.. ఆటగాడిగా జట్టులో కొనసాగలేక రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.

టెస్ట్ ఫార్మాట్‌లో అతని ఫామ్ కూడా గొప్పగా లేకపోవడం.. తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమని భావించే రోహిత్ గౌరవంగా తప్పుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తన వీడ్కోలుకు గల కారణాలను మాత్రం రోహిత్ శర్మ వెల్లడించలేదు. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా రోహిత్ శర్మను తప్పించే అవకాశం ఉంది. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ పేర్లు వినిపిస్తున్నాయి.

Story first published: Wednesday, May 7, 2025, 22:01 [IST]
Other articles published on May 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+