Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇన్‌స్టాలో నాథన్ లయన్‌ ఒక్కడినే ఫాలో అవుతున్న జడేజా.. ఎందుకంటే?

 Why Ravindra Jadeja follows Nathan Lyon on Instagram for 24 hours after Delhi Test

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఓ స్టోరీ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు మిలియన్ల ఫాలోవర్లు ఉన్న జడేజా.. ఒక్కరిని కూడా ఫాలో అవ్వడం లేదు. అయితే ఆదివారం మాత్రం ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లయన్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. 'నా స్నేహితుడు నాథన్ లయన్‌ను 24 గంటలు మాత్రమే ఫాలో అవుతాను'అని ఫన్నీ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు అవాక్కయ్యారు. 24 గంటలు ఫాలో అవ్వడం ఏంటని తలగొక్కున్నారు. నాథన్ లయన్ సైతం తన ఇన్‌స్టా స్టోరీలో ఈ పోస్ట్‌నే షేర్ చేశాడు. దాంతో అభిమానులు మరింత ఆశ్చర్యానికి కారణమయ్యారు. అసలు ఈ పోస్ట్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనేది ఆరాతీయడం మొదలు పెట్టారు. అసలు కారణం తెలిసి అవాక్కయ్యారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీ టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్ సందర్భంగా లయన్.. జడేజాతో మాట్లాడుతూ..'ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికి నువ్వు ఫాలో కావడం లేదు. నువ్వు ఎవరిని ఫాలో అవ్వడం లేదనే విషయం తెలుసు. అయినా నువ్వు నన్ను ఫాలో అవుతావని వెయిట్ చేస్తున్నా. నువ్వు నన్ను ఫాలో అవుతావా?'అని అడిగాడు. ఈ సంభాషణ కాస్త స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యింది. మ్యాచ్ ముగిసిన అనంతరం జడేజా లయన్ కోరికను తీర్చాడు. అయితే 24 గంటలు మాత్రమే ఫాలోఅవుతున్నానని అతనికి ట్విస్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

 Why Ravindra Jadeja follows Nathan Lyon on Instagram for 24 hours after Delhi Test

ఇక ఈ మ్యాచ్‌లో జడేజా కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. 10 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 12వ సారి ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. 2016లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7/49 బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చిన జడేజా.. దీన్ని అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-0తో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. అశ్విన్‌, జడేజా బౌలింగ్‌లో స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌లకు ప్రయత్నించి ఆరుగురు ఆసీస్ బ్యాటర్లు ఔటయ్యారు. దాంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది.

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో భారత్ ముందు 115 పరుగుల లక్ష్యం నమోదు కాగా.. భారత్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయసంగా చేధించింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. చివరి టెస్ట్ మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది.

Story first published: Monday, February 20, 2023, 15:34 [IST]
Other articles published on Feb 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+