Quinton De Kock: మోకాలిపై కూర్చోనని మొండిపట్టు! మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు కీలక నిర్ణయం! సర్వత్రా విమర్శలు!

దుబాయ్: ఏదీ ఏమైనా తాను 'బ్లాక్‌లైవ్ మ్యాటర్స్' ఉద్యమానికి మద్దుతు ఇచ్చేది లేదని మొండిపట్టుతో ఉన్న సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్.. ఆ దేశ క్రికెట్ బోర్డుతో పాటు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంలో బాగా హర్ట్ అయిన డికాక్.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు ఆడేలేనని చెప్పాడు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డుకు తెలిపాడు. దాంతో అప్పటికప్పుడు అతని స్థానంలో రీజా హెన్రిక్స్‌ను సౌతాఫ్రికా టీమ్‌మేనేజ్‌మెంట్ జట్టులోకి తీసుకుంది. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి మద్దతుగా టీ20 ప్రపంచకప్‌లో వివిధ జట్లు వివిధ పద్దతుల్లో మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్ సైతం ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి.

బోర్డు నిర్ణయంతో..
సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా ఇకపై తాము ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో మొకాళ్లపై నిలబడి బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ మూమెంట్‌కు మద్దతు తెలపాలంటూ క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు(సీఎస్‌ఏ) సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే బీడబ్ల్యూఎల్‌కు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న డికాక్.. బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా ట్వీట్ చేశాడు. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి మద్దతు తెలపడం ఇష్టం లేకనే డికాక్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడని డీకే ట్వీట్ చేశాడు.

రిపోర్ట్ ఆధారంగానే తదుపరి చర్యలు..
టాస్ వేయడానికి వచ్చిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బువామా ఈ విషయంపై మాట్లాడుతూ.. 'డికాక్ ఎలాంటి గాయాల బారిన పడలేదు. కానీ వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నాడు' అని పేర్కొన్నాడు. కాగా, క్వింటన్ డి కాక్ ఎందుకు మ్యాచ్ నుంచి తప్పుకున్నాడో అతను తెలుపలేదు. మరోవైపు సీఎస్ఏ డికాక్ దూరమవ్వడానికి గల కారణాన్ని తెలియజేస్తూ ఓ ప్రకటనను విడదలు చేసింది. డికాక్ వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు తమకు చెప్పాడని, అయితే జట్టులోని ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్చ ఉందని పేర్కొంది. అయితే జట్టుగా తీసుకున్న నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. టీమ్‌మేనేజ్‌మెంట్ అందించే రిపోర్ట్ ఆధారంగా డికాక్‌పై తీరుపై ముందడుగు వేస్తామని స్పష్టం చేసింది. దీనిపై డికాక్ స్పందిస్తూ.. 'నా వ్యక్తిగత కారణాలు నాకు ఉన్నాయి. అవి నేను వెల్లడించాల్సిన అవసరం లేదు.' అని పేర్కొన్నాడు.

నల్లజాతీయులపై వివక్ష వ్యతిరేకంగా..
అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా బీఎల్ఎం ఉద్యమం ప్రారంభమైంది. ఐసీసీ కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. తొలి సారిగా ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్ జరిగిన సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇందుకు మద్దతుగా మోకాలిపై కూర్చొని ఓ చేతిని పైకెత్తి సంఘీభావం తెలిపారు. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ప్రతీ మ్యాచ్‌కు ముందు ప్రతీ జట్టు బీఎల్ఎంకు మద్దతు తెలియజేస్తున్నారు. అయితే డికాక్ తీరు పట్ల సోషల్ మీడియా వేదికగా మిమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సంఘీభాం తెలియజేస్తే డికాక్‌కు ఏం అవుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతని అహంకారం స్పష్టంగా తెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు.

వెస్టిండీస్ 143/8
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. లూయిస్ (56) అర్ధసెంచరీతో రాణించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2 రెండు వికెట్లు తీయగా.. నోర్ట్జే, రబాడా, ప్రిటోరియస్ చెరో వికెట్ దక్కించుకునన్నారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 61 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications