Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 తొలి మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ దూరం! ఎందుకంటే..?

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు తొలి మ్యాచ్‌కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నాడు. అప్‌‌కమింగ్ సీజన్‌లో తమ సారథిగా హార్దిక్ పాండ్యానే కొనసాగుతాడని ఇప్పటికే ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మార్చి 13 నుంచి ఐపీఎల్ 2025 సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఐపీఎల్ ఓవర్‌ రేట్ రూల్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. గత సీజన్‌(ఐపీఎల్ 2024)లో ముంబై ఇండియన్స్ సారథిగా హార్దిక్ పాండ్యా వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్‌కు గురయ్యాడు. నిర్ణీత సమయంలో తమ జట్టు ఓవర్లను పూర్తి చేయలేకపోయాడు. దాంతో అతనిపై ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం పడింది.

Why Mumbai Indians Captain Hardik Pandya Banned For First Match Of IPL 2025

స్లో ఓవర్ రేట్ విషయంలో ఆటగాళ్లు సీరియస్‌గా ఉండటం లేదని గ్రహించిన ఐపీఎల్ నిర్వాహకులు కఠిన నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సారి స్లో ఓవర్‌రేట్‌కు గురైతే కెప్టెన్‌ మ్యాచ్ ఫీజులో 12 లక్షలు కోత విధిస్తారు. రెండో సారి ఇదే తప్పిదం రిపీట్ అయితే రూ. 24 లక్షలు, మూడో సారి రిపీట్ అయితే రూ. 30 లక్షల మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు.

అయితే హార్దిక్ పాండ్యా గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మూడోసారి స్లో ఓవర్‌ రేట్‌కు కారణమయ్యాడు. దాంతో అతను అప్‌కమింగ్ సీజన్ తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధం పడింది.

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను ముంబై అంటిపెట్టుకుంది. ఈ కోర్ టీమ్‌కు తగ్గట్లుగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. పేపర్‌‌పై ముంబై ఇండియన్స్ చాలా బలంగా కనిపిస్తోంది.

తొలి మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరంకానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తాత్కలిక కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు చేపడుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. హార్దిక్ గైర్హాజరీలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో రోహిత్ శర్మ డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్‌ ముంబై ఇండియన్స్‌ను నడిపించాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్‌కు సారథ్యం వహించలేదు.

Story first published: Wednesday, January 8, 2025, 16:28 [IST]
Other articles published on Jan 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+