For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ధోనీ, రైనా రిటైర్మెంట్‌కు ఆగస్ట్ 15 ఎంచుకున్నారా?

why MS Dhoni and Suresh Raina chose August 15 as retirement date
MS Dhoni Retires : ధోనీ, రైనా ఆగస్టు 15 న రిటైర్మెంట్ చెప్పడానికి కారణం ఏంటంటే..? || Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్, వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా సింపుల్‌గా ధోనీ ఓ ఇన్‌స్టా పోస్ట్‌తో తన నిర్ణయాన్ని వెల్లడించగా.. ఆ వెంటనే ఏ మాత్రం ఊహించని విధంగా 'నీ దారిలోనే నడుస్తా' అంటూ సురేశ్‌ రైనా ఆటకు అల్విదా చెప్పాడు.

'కెరీర్‌ అసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ వీడియోను ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇక రైనా 'నీతో కలసి ఆడడం కంటే ఏదీ గొప్ప కాదు. నీతో కలసి ఆడినందుకు నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతున్నది. ఈ జర్నీలో నీతో పాటే నడవాలని అనుకుంటున్నా. భారతావనికి ధన్యవాదాలు.. జైహింద్'అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

ఇక ఈ దిగ్గజాల అనూహ్యం నిర్ణయం పట్ల అభిమానులంతా షాక్ గురయ్యారు. సోసల్ మీడియా వేదికగా వారి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లను గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ధోనీ, రైనా రిటైర్మెంట్ జరుగుతున్న ఓ ప్రచారం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. భారత స్వాతంత్ర్యదినోత్సవమైన ఆగస్టు 15న ఈ దిగ్గజాలు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారనే చర్చ ఊపందుకుంది. అది కూడా ఐపీఎల్ కోసం చెన్నై క్యాంప్‌కు చేరుకున్న మరుసటి రోజే నిర్ణయం వెలువడటం అనేక ఊహాగానాలకు అవకాశం ఇస్తుంది.

ఈ క్రమంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్.. అందరిని ఆకట్టుకుంటుంది. పైగా దానికి సురేశ్ రైనా స్పందించడమే నిజమేనేమో అని నమ్మెలా చేస్తుంది. ఇంతకీ అదేంటంటే..'73'కు వీడ్కోలు పలకడం. శనివారంతో భారత్‌ 73 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకొని 74వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ రోజునే '7' నెంబర్‌ జెర్సీ గల ధోనీ, '3' నెంబర్‌ జెర్సీ గల రైనా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సదరు నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి సురేశ్ రైనా పాయింట్.. అనే ఏమోజీతో స్పందించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.ఇక అభిమానులు అయితే ఈ రెండు అంశాలకు (73-7,3) పోలిక పెడుతూ వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాల్లో స్టేటస్‌లతో రెచ్చిపోతున్నారు. అనుకొని చేశారో.. లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ.. ఇది మాత్రం అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది.

దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్‌ల్లో 768, వన్డేల్లో 5615, టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఏడు సెంచరీలు నమోదు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన రైనా టెస్ట్‌ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.

Story first published: Sunday, August 16, 2020, 12:03 [IST]
Other articles published on Aug 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+