Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: సంజూ, కుల్దీప్‌పై వేటు.. ఎందుకంటే?

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల తర్వాత భారత్ టాస్ గెలవడం గమనార్హం. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన భారత్.. సూర్యకుమార్ సారథ్యంలోనూ తొలి రెండు టీ20ల్లో టాస్ గెలవలేదు. ఎట్టకేలకు మూడో టీ20లో టాస్ గెలిచి ఊపిరి పీల్చుకుంది.

పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నానని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. రెండో ఇన్నింగ్స్‌లో కండిషన్స్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. బ్యాట్‌పైకి బంతి ముద్దుగా వస్తుంది. ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఉన్నాం. తుది జట్టులో మూడు మార్పులు చేశాం. జితీష్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

Why Kuldeep Yadav and Sanju Samson Were Excluded from India s Playing XI vs Australia in 3rd T20I

టీ20 ప్రపంచకప్ సన్నద్దతలో భాగంగా తుది జట్టులో భారీ మార్పులు చేసినట్లు అర్థమవుతుంది. మార్పుల కారణంగా హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ ఉద్వాసనకు గురయ్యారు. అందరికి అవకాశాలు ఇవ్వాలనే సూత్రాన్ని గంభీర్ పాటిస్తున్నట్లు అర్థమవుతుంది.

మరోవైపు ముందుగా బ్యాటింగ్ చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు. 'ఇది మంచి వికెట్. మంచి ఆరంభం అందుకొని భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. మేం ఒకే ఒక్క మార్పు చేశాం. జోష్ హజెల్ వుడ్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులోకి వచ్చాడు.'అని మిచ్ మార్ష్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, టీమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినీస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, గ్జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమన్.

Story first published: Sunday, November 2, 2025, 13:38 [IST]
Other articles published on Nov 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+