For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శృంగారమే బుమ్రా కొంపముంచిందా..? వీపు వాపుకి కారణం అదేనా..?

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం తీవ్రతపై స్పష్టత కొరవడింది. ఆస్ట్రేలియా పర్యటనలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన బుమ్రా.. ఒంటి చేత్తో జట్టును నడిపించాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 151.2 ఓవర్లు బౌలింగ్ చేసి 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 39 ఓవర్లు మెయిడిన్ చేయడంతో పాటు అత్యల్ప ఎకానమీ(2.76)ని నమోదు చేశాడు. 13.06 సగుటతో 418 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఈ సిరీస్‌లో ఈ గణంకాలను మరే బౌలర్ నమోదు చేయలేదు. అతనికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అలాంటి బుమ్రా కీలకమైన సిడ్నీ టెస్ట్‌ మధ్యలోనే వెన్ను నొప్పితో మైదానం వీడాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ వెంటనే అతన్ని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించింది. తిరిగొచ్చిన బుమ్రా.. ఈ మ్యాచ్‌లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. బౌలింగ్, ఫీల్డింగ్ చేయలేదు.

The BCCI has given no statement on Jasprit Bumrah s back injury and his return to action

బుమ్రా స్కానింగ్ రిపోర్ట్ ఏంటి..?
అయితే అతని గాయానికి సంబంధించిన విషయాన్ని బీసీసీఐ గోప్యంగా ఉంచింది. అతనికి తీసిన స్కాన్‌లో ఏం తేలింది? వైద్యులు ఏమన్నారు? ఏం గాయమైంది? లాంటి వివరాలను బీసీసీఐ ఇప్పటి వరకు వెల్లడించలేదు. బుమ్రా సైతం తన గాయం గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం మాట్లాడుతూ..కొన్నిసార్లు శరీరం మాట మనం వినాలని చెప్పాడు. వెన్ను భాగంలో అసౌకర్యంగా అనిపించడంతోనే మైదానం వీడినట్లు వెల్లడించాడు. అంతకుమించి మరో మాట చెప్పలేదు.

దాంతో అతని గాయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రకటించాల్సిన భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. బుమ్రా గాయం తీవ్రతపై స్పష్టత కోసమే జట్టును ఇంకా ప్రకటించలేదనే వార్తలు వచ్చాయి. అతని గాయం తీవ్రతను తెలుసుకునేందుకు మరింత సమయం పట్టనుందని, ప్రస్తుతం బుమ్రా వీపుపై వాపు ఉందని, అది తగ్గిన తర్వాతే గాయం నుంచి కోలుకునే ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి.

వాపుకు శృంగారమే కారణమా..?
వీపుపై వాపు రావడంతో బుమ్రాను బెస్ట్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే బుమ్రా వీపుపై వాపు వచ్చిందనే వార్తలు జట్టు వర్గాలతో పాటు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తీవ్రమైన డిస్క్ లేదా కండరాల వాపు అనే సందేహాలు మొదలయ్యాయి. అదే జరిగితే మాత్రం బుమ్రా మరోసారి సుదీర్ఘ కాలం పాటు జట్టుకు దూరం కావాల్సి వస్తుంది.

బుమ్రా వీపుపై వాపు రావడానికి శృంగారమే కారణమా? అనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. వెన్ను నొప్పితో మాత్రమే మైదానం వీడిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. దాంతో అతని గాయం చిన్నదేనని అంతా అనుకున్నారు. వెన్నుపై ఒత్తిడి పడవద్దనే అతనితో బౌలింగ్ చేయించలేదు. అయితే స్వదేశం వచ్చిన తర్వాత బుమ్రా శృంగారంలో పాల్గొనడంతో వెన్నుపై ఒత్తిడి పడిందని, దాంతో వీపు వాచిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే బుమ్రాకు బీసీసీఐ బెడ్ రెస్ట్ సూచించిందని కామెంట్ చేస్తున్నారు.

ఈ ఫేక్ న్యూస్ చూసి నవ్వుకున్నా..
మరోవైపు బెడ్ రెస్ట్ వార్తలను బుమ్రా ఖండించాడు. 'ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయడం చాలా సులువని నాకు తెలుసు. కానీ ఇది నాకు నవ్వు తెప్పించింది. ఈ విశ్వసనీయ వర్గాలు నమ్మదగినవి కావు'అని బుమ్రా ట్వీట్ చేశాడు. బుమ్రా ఈ వార్తలను కొట్టిపారేసినా నెటిజన్లు నమ్మడం లేదు. బుమ్రా గాయం తీవ్రంగా లేకుంటే బీసీసీఐ ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదని, జట్టును ప్రకటనను ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.

Story first published: Friday, January 17, 2025, 11:05 [IST]
Other articles published on Jan 17, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+