Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ 4th T20I: ఇషాన్ కిషన్‌‌ ఆడటం లేదు.. ఎందుకంటే?

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లోనూ టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ఇది మంచి వికెట్‌లా కనిపిస్తోంది. నిన్న ప్రాక్టీస్ సమయంలో ఇక్కడ విపరీతమైన మంచు కురిసింది. ఈ రోజు కూడా ఉక్కపోతగానే ఉంది. కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో బంతి బ్యాట్‌పైకి వస్తుందని భావిస్తున్నాం. కేవలం ఈ సిరీస్‌లోనే కాకుండా గతేడాదిగా మేం అలవాటు చేసుకున్న మంచి అలవాట్లను కొనసాగించాలనుకుంటున్నాం.

గత మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకొని, మరింత స్వేచ్ఛగా ఆడి అభిమానులను అలరించాలనుకుంటున్నాం. ఇషాన్ కిషన్‌కు చిన్న గాయం కావడంతో అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ కోలుకోవడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకొని స్వేచ్ఛగా, నిర్బయంగా ఆడాలి. ఈ రోజు మా వద్ద ఐదు మంచి బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

Why Ishan Kishan Was Left Out of India s Playing XI for 4th T20I against New Zealand in Vizag

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామని న్యూజిలాంట్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. 'డ్యూ ప్రభావం నేపథ్యంలో మేం మరికొన్ని పరుగులు అదనంగా చేయాలనుకుంటున్నాం. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. లాకీ ఫెర్గూసన్, బ్రెస్‌వెల్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. అలెన్ ఇంకా జట్టుతో కలవలేదు. కైల్ జెమీసన్ స్థానంలో జాక్ ఫోక్స్ బరిలోకి దిగుతున్నాడు. నీషమ్ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదు.'అని సాంట్నర్ చెప్పుకొచ్చాడు.


న్యూజిలాండ్:

టిమ్ సీఫెర్ట్ (కీపర్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జాక్ ఫోక్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.

భారత్ :

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Wednesday, January 28, 2026, 18:55 [IST]
Other articles published on Jan 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+