సూపర్ ఓవర్‌లో వైభవ్ సూర్యవంశీకి స్ట్రైక్ ఎందుకు ఇవ్వలేదు?
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు గొడవపడటం,భారత్ ఏ జట్టు తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సూపర్ ఓవర్‌లో దూకుడుగా ఆడే బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి స్ట్రైక్ ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
సూపర్ ఓవర్‌లో శ్రీలంక 16 పరుగులు చేయగా.. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కుకత్సల్ మధులన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సూపర్ ఓవర్ ముగియగానే శ్రీలంక ఆటగాడితో వైభవ్ సూర్యవంశీ ఘర్షణకు దిగాడు. రెచ్చగొట్టే మాటలు అనడంతో సహనం కోల్పోయిన వైభవ్ సదరు ఆటగాడిని నెట్టేసాడు. ఈ సూపర్ ఓవర్‌లో స్ట్రైక్ తీసుకున్న సూర్యాన్ష్ షెడ్గే తొలి 3 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశాడు.
వైభవ్ స్ట్రైక్ తీసుకొని ఉంటే..
వైభవ్ సూర్యవంశీ తొలి బంతిని ఎదుర్కోకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. వైభవ్ స్ట్రైక్ తీసుకొని ఉంటే 6 బంతుల్లో 3 సిక్స్‌లు బాది మ్యాచ్‌ను గెలిపించేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వైభవ్ సూర్యవంశీకి స్ట్రైక్ ఇవ్వకుండా భారత్ ఏ టీమ్ మూల్యం చెల్లించుకుందని విమర్శలు గుప్పిస్తున్నారు.

అంతకుముందు శ్రీలంక ప్లేయర్ సతీరా సమరవిక్రమ 91 పరుగులతో శ్రీలంక జట్టును విజయం దిశగా నడిపించారు. కానీ గుజరాత్ టైటాన్స్ లెఫ్టార్మ్ పేసర్ అర్షద్ ఖాన్ చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శ్రీలంక విజయానికి చివరి ఓవర్‌లో 5 పరుగులే అవసరం కాగా.. అర్షద్ ఖాన్ సమరవిక్రమాను ఔట్ చేయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు. దాంతో స్కోర్లు సమమయ్యాయి.
సూపర్ ఓవర్ కోసం గొడవ..
ఆ తర్వాత మైదానంలో హైడ్రామా నెలకొంది. ఆఖరి బంతికి లెగ్ బై ఎలా ఇస్తారని తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా సూపర్ ఓవర్ కోసం పట్టుబట్టాడు. సూపర్ ఓవర్‌లో అర్షద్ ఖాన్ ఒకవైడ్, ఒక నోబాల్ సాయంతో 16 పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ భారత్ ఏ 9 పరుగులే చేసి ఓటమిపాలైంది.
అంతకు ముందు భారత్ ఏకు వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 21) అద్భుతమైన ఆరంభాన్ని అందించినా.. ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. తిలక్ వర్మ(23), రుతురాజ్ గైక్వాడ్(32) కూడా నిరాశపర్చారు. మిడిల్ ఓవర్లోలోనూ భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దాంతో 143 పరుగులకే భారత్ ఏ 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అప్పనంగా 10 పరుగులు..
ఈ పరిస్థితుల్లో సూర్యాన్ష్ షెడ్గే(72), విప్రజ్ నిగమ్(51) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఈ జోడీ 104 పరుగులు జోడించడంతో భారత్ 265 పరుగులు చేయగలిగింది. అయితే ఈ ఇద్దరూ పిచ్ మధ్యలో నుంచి పదే పదే పరుగెత్తడంతో భారత్ ఏకు అంపైర్లు 10 రన్స్ పెనాల్టీ విధించారు. ఇది శ్రీలంకకు కలిసొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

