ఆసియా కప్ 2025 టోర్నీ తుది దశకు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, పాకిస్థాన్‌లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండింటికి రెండు కూడా భారత్ గెలిచింది. ముచ్చటగా మూడోసారి దాయాదీ దేశాలు తలపడనున్నాయి. అయితే ఫామ్ చూసుకున్నా.. బలబలాలు పరిశీలించినా.. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు పాకిస్థాన్ ఏ మాత్రం పోటీ కాదు.
ఐసీసీ, ఆసియా కప్ టోర్నీ రికార్డ్స్‌లో కూడా భారత్‌కు తిరుగులేదు. కానీ ఇరు జట్ల మధ్య ఉన్న ఫైనల్ రికార్డ్స్ మాత్రం టీమిండియాను కలవరపెడుతున్నాయి. ఐసీసీ టోర్నీల్లో చాలా తక్కువ సార్లే టీమిండియా, పాకిస్థాన్‌లు ఫైనల్లో తలపడ్డాయి. కానీ ఆసియా కప్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఫైనల్ జరగలేదు. గత 41 ఏళ్లలో ఇదే తొలిసారి.

ఇప్పటి వరకు ఇరు జట్లు 12 టోర్నీల్లో ఫైనల్లో తలపడగా.. భారత్ కేవలం నాలుగు సార్లు మాత్రమే గెలిచింది. మరో 8 సార్లు ఓడిపోయింది. ఈ రికార్డే అభిమానులను కలవరపెడుతుంది. టీమిండియా చివరిసారిగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో భారత్ 180 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మాత్రం భారత్ 5 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది.
1985 వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ టోర్నీలో తొలి సారి పాకిస్థాన్‌తో ఫైనల్ ఆడిన భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా-ఆసియాకప్ ఫైనల్లో ఒక్క వికెట్ తేడాతో భారత్‌ను పాకిస్థాన్ ఓడించింది. విల్ ట్రోఫీ 1991, ఆస్ట్రేలియా ఆసియా కప్ 1994, సిల్వర్ జూబ్లీ ఇండిపెండెన్స్ కప్ 1998 రెండో ఫైనల్, పెప్సీ కప్ 1999, కోకోకోలా కప్ 1999, కిట్‌ప్లై కప్ 2008, ఛాంపియన్స్ ట్రోఫీ 2017 టోర్నీల్లో పాకిస్థాన్ విజయం సాధించింది.
టీ20 ఫార్మాట్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 15 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు విజయం సాధించింది. పాకిస్థాన్ కేవలం మూడింటిలోనే గెలిచింది. వన్డే, టెస్ట్‌ల్లో ఇరు జట్లు 210 మ్యాచ్‌లు ఆడగా.. పాకిస్థాన్ 88, భారత్ 79 విజయాలు సాధించాయి. 38 టెస్ట్‌లు డ్రా అయ్యాయి.
| టోర్నీ | ఫలితం | ఫార్మాట్ | వేదిక | సంవత్సరం |
| ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ | భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది | వన్డే | మెల్‌బోర్న్ | 1985 |
| ఆస్ట్రల్-ఆసియా కప్ | పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో గెలిచింది | వన్డే | షార్జా | 1986 |
| విల్స్ ట్రోఫీ | పాకిస్థాన్72 పరుగుల తేడాతో గెలిచింది | వన్డే | షార్జా | 1991 |
| ఆస్ట్రల్-ఆసియా కప్ | పాకిస్థాన్ 39 పరుగుల తేడాతో గెలిచింది | వన్డే | షార్జా | 1994 |
| సిల్వర్ జూబ్లీ ఇండిపెండెన్స్ కప్ తొలి ఫైనల్ | భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది | వన్డే | ఢాకా | 1998 |
| సిల్వర్ జూబ్లీ ఇండిపెండెన్స్ కప్ రెండో ఫైనల్ | పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలిచింది | వన్డే | ఢాకా | 1998 |
సిల్వర్ జూబ్లీ ఇండిపెండెన్స్ కప్ మూడో ఫైనల్ | భారత్ 3 వికెట్ల తేడాతో గెలిచింది | వన్డే | ఢాకా | 1998 |
| పెప్సి కప్ | పాకిస్థాన్ 123 పరుగుల తేడాతో గెలిచింది | వన్డే | బెంగళూరు | 1999 |
| కోకో-కోలా కప్ | పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో గెలిచింది | వన్డే | షార్జా | 1999 |
| టీ20 ప్రపంచకప్ | భారత్ 5 పరుగుల తేడాతో గెలిచింది | టీ20 | జోహన్నెస్‌బర్గ్ | 2007 |
| కిట్‌ప్లై కప్ | పాకిస్థాన్ 25 పరుగుల తేడాతో గెలిచింది | వన్డే | మీర్‌పూర్ | 2008 |
| ఛాంపియన్స్ ట్రోఫీ | పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో గెలిచింది | వన్డే | ఓవల్ | 2017 |