Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే హార్దిక్ పాండ్యాపై వేటు..!

టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ వారసుడిగా పొట్టి ఫార్మాట్‌లో జట్టును నడిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. టీ20 కెప్టెన్సీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్ 2026 విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న గంభీర్.. కెప్టెన్సీ బాధ్యతలను విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించేందుకు సిద్దమయ్యాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా శ్రీలంకతో టీమిండియా మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు ఆడనుంది.

Why Hardik Pandya Sidelined For T20I Captaincy

ఈ పర్యటనతోనే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా తన బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ పర్యటనకు ఎంపిక చేసే భారత జట్ల గురించి గంభీర్.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్క‌ర్‌తో ఇప్పటికే సమావేశమైనట్లు తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లంతా శ్రీలంక పర్యటనకు అందుబాటులో ఉండాలని గంభీర్ కోరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20ల్లో వారి స్థానాలను భర్తీ చేయడంతో పాటు కొత్త కెప్టెన్‌‌ను ఎంపిక చేయడం గంభీర్ ముందున్న అతిపెద్ద టాస్క్. వన్డే ప్రపంచకప్ 2023 ముందు రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ టీమ్ 50 ఓవర్ల ఫార్మాట్ ఆడితే... హార్దిక్ పాండ్యా సారథ్యంలోని కుర్రాళ్ల జట్టు టీ20 సిరీస్‌లు ఆడింది.

దాంతో రోహిత్ శర్మ వారసుడిగా హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ అతని ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడమే జట్టుకు శ్రేయస్కారమని గంభీర్ భావిస్తున్నాడట.

కెప్టెన్‌గా ప్రతీ మ్యాచ్ ఆడాల్సి ఉంటుందని, అప్పుడు హార్దిక్ గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది. హార్దిక్ ఆటగాడిగా జట్టులో కొనసాగితే అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్‌చేయవచ్చని గంభీర్ భావిస్తున్నాడని సదరు వెబ్‌సైట్ తమ కథనంలో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే గంభీర్.. టీ20 కెప్టెన్సీకి సూర్య పేరును సూచించినట్లు తెలుస్తోంది.

అయితే టీ20 కెప్టెన్సీ నియామకంపై సెలెక్టర్లు, బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై హార్దిక్ పాండ్యా ఎలా రియాక్ట్ అవుతాడనేది కూడా కీలకం కానుంది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తే.. జట్టులో విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది.

Story first published: Wednesday, July 17, 2024, 8:50 [IST]
Other articles published on Jul 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+