Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs SRH: లావెండర్ జెర్సీలో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. ఎందుకంటే..?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు లావెండర్ కలర్ జెర్సీలో బరిలోకి దిగారు. రెగ్యులర్‌గా గుజరాత్ ఆటగాళ్లు బ్లూ కలర్ జెర్సీలో ఆడుతారు. కానీ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మాత్రం ప్రత్యేకంగా లావెండర్ కలర్ జెర్సీ‌లను ఉపయోగించారు.

అయితే ఈ జెర్సీల వెనుక గొప్ప సామాజిక ఉద్దేశ్యం ఉంది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో పాటు ఈ మహమ్మారితో బాధపడుతున్న వారికి సంఘీభావం తెలిపేందుకు ప్రతీ ఏడాది గుజరాత్ టైటాన్స్ ఓ మ్యాచ్‌ను లావెండర్ కలర్ జెర్సీలో ఆడుతోంది. 'ఈ రాత్రి కేవలం ఆట మాత్రమే కాదు.. క్యాన్సర్‌పై పోరాటంలో అందరం ఏకమై మద్దతు తెలపడం కూడా..'అని గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తన అధికారిక ట్వీట్‌లో పేర్కొంది.

Why Gujarat Titans Are Wearing a Special Lavender Jersey Against SRH in IPL 2026
Photo Credit: GT(X)

సోషల్ మీడియా వేదికగా ప్రచారాం..

ఈ మ్యాచ్‌కు ముందు నుంచే అంటే గత రెండు రోజులుగా గుజరాత్ టైటాన్స్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అంతేకాకుండా.. తమ సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాలను, వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్‌ను కూడా లావెండర్ రంగులోకి మార్చేసింది. మైదానంలో మ్యాచ్ చూడటానికి వచ్చే అభిమానులకు కూడా లావెండర్ రంగు జెండాలను అందజేశారు.

ఐపీఎల్ 2023 సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఆ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనే తొలిసారి ఈ లావెండర్ కలర్ జెర్సీని ధరించింది. 2024లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ జెర్సీతో బరిలోకి దిగినా వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయ్యింది. గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ ఈ లావెండర్ జెర్సీని ధరించింది. ఈ మూడు సందర్భాల్లో గుజరాత్ టైటాన్స్ ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రదయ్యింది.

ఆర్‌సీబీకి గ్రీన్ జెర్సీ.. రాజస్థాన్‌కు పింక్ జెర్సీ..

గుజరాత్ టైటాన్సే కాకుండా ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా ప్రత్యేకమైన జెర్సీలతో ఒక మ్యాచ్ ఆడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఆర్‌సీబీ 'గో గ్రీన్' (Go Green) ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ గ్రీన్ జెర్సీని ధరించింది.

మహిళా సాధికారతను ప్రోత్సహించే ఉద్దేశంతో రాజస్థాన్ రాయల్స్ పింక్ జెర్సీతో బరిలోకి దిగుతోంది. జైపూర్‌ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పూర్తి పింక్ కలర్ జెర్సీతో ఆడింది.

Story first published: Tuesday, May 12, 2026, 20:59 [IST]
Other articles published on May 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+