IPL 2016 రిపీట్.. SRH టైటిల్ లోడింగ్!
ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరింది. మరో మూడు మ్యాచ్‌లతో లీగ్ దశ ముగియనుంది. అయితే ఈ సీజన్ ఐపీఎల్ 2016 సీజన్‌ను తలపిస్తోంది. ఐపీఎల్ 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని 8 పరుగులతో ఓడించి మరి ఆరెంజ్ ఆర్మీ తొలి టైటిల్ అందుకుంది.
తాజా సీజన్ కూడా ఐపీఎల్ 2016 టోర్నీని తలపిస్తుండటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2016 సీజన్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మూడో స్థానంలోనే నిలిచింది. ఎలిమినేటర్‌లో కేకేఆర్‌ను ఓడించి క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్‌పై గెలిచి ఫైనల్ చేరింది. ఆ సీజన్‌లో కూడా ఆర్‌సీబీ టాప్-2లో నిలిచి క్వాలిఫయర్-1 గెలిచి ఫైనల్ చేరింది.

తాజా సీజన్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలవగా.. ఆర్‌సీబీ టేబుల్ టాపర్‌గా క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీ మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా చెరో మ్యాచ్ గెలిచాయి. ఐపీఎల్ 2016 సీజన్‌లోనూ ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడగా చెరో విజయాన్ని అందుకున్నాయి. ఆ సీజన్‌లో కూడా తొలి మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. రెండో మ్యాచ్‌లో గెలిచింది.
ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తృటిలో టాప్-2 ప్లేస్‌ను కోల్పోయింది. ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌తో సమాన పాయింట్స్ సాధించినా.. పేలవ రన్‌రేట్ కారణంగా మూడో స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ ఎలిమినేటర్ ప్రత్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు.
రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ రేసులో ఉన్నాయి. రాజస్థాన్‌కు మెరుగైన అవకాశాలు ఉండగా.. పంజాబ్, కేకేఆర్‌కు సమాన అవకాశాలు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ప్లే ఆఫ్స్ బెర్త్‌పై క్లారిటీ రానుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరుతుంది. లేదంటే ఇతర జట్లకు అవకాశం దక్కుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

