Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌లో వయాగ్రా వాడనున్న ఇంగ్లండ్ ప్లేయర్లు

సాధారణంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు వాడే 'వయాగ్రా' టాబ్లెట్లను..ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు వాడనున్నారు. ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా మెక్సికోతో సోమవారం జరిగే ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ వయాగ్రా టాబ్లెట్లు వేసుకొని బరిలోకి దిగనుంది. ఇందుకు సంబంధించి ఫిఫా అధికారుల నుంచి ఇంగ్లండ్ ఫుట్‌బాల్‌ టీమ్‌కు అనుమతి లభించింది.

అయితే ఇది ఎటువంటి డోపింగ్ పరిధిలోకి రాదని, ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని, స్టామినాను పెంచడానికే ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రిక్వార్టర్స్ మ్యాచ్ జరిగే ఎస్టాడియో అజ్టెకా స్టేడియం సముద్ర మట్టానికి 7,350 అడుగుల ఎత్తులో నిర్మితమైంది. అక్కడ ఆటగాళ్లు సాధారణం కంటే తీవ్రమైన అలసటను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌ను అధిగమించేందుకు ఇంగ్లండ్ ప్లేయర్లు వయాగ్రా వాడనున్నారు.

FIFA World Cup 2026 Why England Players Are Allowed to Take Viagra Before Mexico Clash

స్టామినా కోసమే..

ఫుట్‌బాల్ లాంటి హై-ఇంటెన్సిటీ ఆటలో ఆటగాళ్లు మైదానంలో నిరంతరం పరుగెత్తాల్సి ఉంటుంది. వయాగ్రాలో ఉండే 'సిల్డెనాఫిల్' అనే రసాయనం శరీరంలోని రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. దీనివల్ల గుండె నుంచి ఊపిరితిత్తులకు, కండరాలకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా వేగంగా అందుతుంది. తద్వారా ఆటగాళ్లు త్వరగా అలసిపోకుండా, వారి శ్వాసక్రియ సజావుగా సాగడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

ఆస్ట్రేలియా ఖేల్ ఖతమ్.. ప్రపంచకప్ నుంచి ఔట్!

ఆస్ట్రేలియా ఖేల్ ఖతమ్.. ప్రపంచకప్ నుంచి ఔట్!

డోపింగ్ సమస్యల్లేవ్..

ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) నిషేధిత మందుల జాబితాలో వయాగ్రా లేదు. కాబట్టి దీనిని వాడటం వల్ల ఆటగాళ్లకు ఎలాంటి చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం లేదు. గతంలోనూ కొందరు రన్నర్లు, సైక్లిస్టులు తమ స్టామినా పెంచుకోవడానికి దీనిని ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి.

ఫిఫా ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో చిన్న తప్పు కూడా టైటిల్ ఆశలను గల్లంతు చేస్తోంది. అందుకే ప్రత్యర్థులను శారీరకంగా, వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేందుకు ఇంగ్లండ్ జట్టు ఈ సరికొత్త 'వయాగ్రా' వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వయాగ్రా వ్యూహం క్రీడావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

మెరిసిన మెస్సీ.. గట్టెక్కిన అర్జెంటీనా

మెరిసిన మెస్సీ.. గట్టెక్కిన అర్జెంటీనా

జోరు మీదున్న ఇంగ్లండ్..

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఇంగ్లండ్ దుమ్మురేపుతోంది. హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్ వంటి స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టైటిల్ రేసులో హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. గ్రూప్ దశలో అద్భుత విజయాలు సాధించిన 'త్రీ లయన్స్'.. నాకౌట్ దశలోనూ తమ వ్యూహాత్మక శైలి, పటిష్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని మట్టికరిపించింది. మరోవైపు, సంయుక్త ఆతిథ్య దేశమైన మెక్సికోకు సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో చెలరేగుతోంది. ఇరు దేశాలు గెలుపే లక్ష్యంగా ప్రిక్వార్టర్స్ బరిలోకి దిగుతున్నాయి.

Story first published: Saturday, July 4, 2026, 11:18 [IST]
Other articles published on Jul 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+