For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్‌తో బరిలోకి దిగారు!

why England cricketers are wearing black armbands in Chepauk Test against India

చెన్నై: భారత్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్‌‌తో బరిలోకి దిగారు. బ్రిటీష్ ఆర్మీ ఆఫిసర్, వ్యాపారవేత్త కెప్టెన్ టామ్ మూరె(100) మృతికి సంతాపంగా ఆటగాళ్లంతా బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించారు. కరోనా బారిన పడిన కెప్టెన్ టామ్.. 100 ఏళ్ల వయసులో చికిత్స పొందతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. దాంతో ఆటగాళ్లంతా తమ యుద్ద వీరుడికి నివాళులర్పించారు.

బ్రిటన్ లో కరోనా వ్యాప్తి ప్రారంభం కాగానే, దాన్ని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ సమయంలో ఫండ్ రైజింగ్ ఆలోచన చేసిన తొలి వ్యక్తిగా కెప్టెన్ టామ్ పేరు సుపరిచితమే. మిలియన్ డాలర్ల నిధిని సేకరించి, కరోనాపై పోరుకు తనవంతు సాయాన్ని చేసిన ఆయన చివరకు అదే మహమ్మారి బారిన పడి కన్నుమూశారు.

ఇక తొలి రోజు ఆటలో ఇంగ్లండే ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ జోరూట్(197 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 128 బ్యాటింగ్) సూపర్ సెంచరీకి తోడుగా ఓపెనర్ డామ్ సిబ్లీ(286 బంతుల్లో 12 ఫోర్లతో 87) బాధ్యాతాయుతమైన బ్యాటింగ్‌‌తో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 89.3 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 200 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు.

భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల జోరును అడ్డుకోవడంలో భారత బౌలర్లు సమష్టిగా విఫలమయ్యారు. అనుభవం లేని ఇద్దరి స్పిన్నర్లతో బరిలోకి దిగడం భారత జట్టుకు చేటు చేసింది. కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడుతున్నజోరూట్‌కు ఇది 20వ సెంచరీ.

కాగా 98, 99, 100వ మ్యాచ్‌ల్లో సెంచరీలు అందుకున్న తొలి క్రికెటర్‌గా జోరూట్ చరిత్ర కెక్కాడు. ఇక 100వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన 9వ ఆటగాడిగా కూడా ఈ ఇంగ్లండ్ కెప్టెన్ గుర్తింపు పొందాడు. భారత పర్యటనకు ముందు శ్రీలంక పర్యటనలో ఓ ద్విశతకం, మరో భారీ సెంచరీతో జోరూట్ సత్తా చాటిన విషయం తెలిసిందే

Story first published: Friday, February 5, 2021, 17:52 [IST]
Other articles published on Feb 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+