Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్క సారా పెళ్లి కాకుండానే అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. ఎందుకంటే?

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతని కొడుకు అర్జున్ టెండూల్కర్‌ పెళ్లికి రంగం సిద్దమైంది. 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్‌కు ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు సానియా చందోక్‌తో సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ నిశ్చితార్థానికి సంబంధించి సచిన్ కుటుంబం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అత్యంత గోప్యంగా సన్నిహితుల సమక్షంతో ఈ ఎంగేజ్‌‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే అక్క సారా టెండూల్కర్ పెళ్లి కాకుండానే అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సచిన్ కూడా కూతురు పెళ్లి కాకుండానే కొడుకు పెళ్లి చేయడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే సారా టెండూల్కర్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పడంతో సచిన్ కుంటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సారా టెండూల్కర్ కెరీర్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన్లు సమాచారం.

Why Did Sachin Tendulkar Arrange His Son Arjun s Engagement Before Daughter Sara Tendulkar s

శుభ్‌మన్‌ గిల్‌తో లవ్ ఎఫైర్ వల్లే..

ప్రస్తుతం మోడలింగ్ చేస్తున్న సారా టెండూల్కర్.. ఇటీవలే ఆస్ట్రేలియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికైంది. అంతేకాకుండా సచిన్‌కు సంబంధించిన చారిటబుల్ ట్రస్ట్‌లను కూడా చూసుకుంటుంది. శుభ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం కూడా సారా టెండూల్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సారా, గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు మూడేళ్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ జోడీ ఇప్పటి వరకు అధికారికంగా తమ రిలేషన్ గురించి ప్రకటించలేదు. సీక్రెట్‌గానే ఈ ప్రేమయాణాన్ని నడిపిస్తున్నారు.

శుభ్‌మన్ గిల్ కోసమే..

ఈ ఇద్దరూ విడిపోయారని మధ్యలో వార్తలు వచ్చినా.. అవన్నీ అవాస్తవమని స్పష్టమైంది. యువరాజ్ సింగ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో సారా టెండూల్కర్ పాల్గొనడం, శుభ్‌మన్ గిల్‌ను భారత ఆటగాళ్లు ఆటపట్టించడం చర్చనీయాంశమైంది. 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ ఇప్పుడే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడిప్పుడే టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టిన అతను మరో రెండు, మూడేళ్ల పాటు కెరీర్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నాడు. సారా కూడా శుభ్‌మన్ గిల్ కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాలతోనే సారా టెండూల్కర్ కంటే ముందే అర్జున్ పెళ్లి చేసేందుకు సచిన్ ఫ్యామిలీ సిద్దమైనట్లు తెలుస్తోంది.

పెళ్లి చేస్తే సెట్ అవుతాడని..

అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ కూడా గొప్పగా లేదు. టీమిండియాకు ఆడుతాడనే ఆశ కూడా కోల్పోయినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం అతను గోవా టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై జట్టుకు ఆడుతున్నా తుది జట్టులో చోటు దక్కే పరిస్థితులు లేవు. పేస్ ఆల్‌రౌండర్ అయిన అర్జున్ టెండూల్కర్.. అప్పుడప్పుడు కళ్లు చెదిరే ప్రదర్శనలు చేసినా.. నిలకడగా రాణించలేకపోయాడు. సచిన్ కొడుకు అనే ట్యాగ్‌తోనే కెరీర్‌లో నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి పెళ్లి చేస్తే సెట్ అవుతాడని సచిన్ ఫ్యామిలీ భావించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా అర్జున్ నిశ్చితార్థం చేసుకున్న సానియా చందోక్ తమ వ్యాపారాలు చూసుకుంటుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ప్రముఖ పెట్ కేర్ బ్రాండ్ అయిన 'మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్పీ'కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థను 2022లో సానియానే ప్రారంభించింది. ఆమె కుటుంబం.. హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో కొనసాగుతోంది. ఘాయ్ కుటుంబానికి చెందిన గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ గ్రూప్ 'ది బ్రూక్లిన్ క్రీమెరీ' వాళ్లకు చెందినదే. బాస్కిన్ రాబిన్స్ ఇండియా కార్యకలాపాలను కూడా ఘాయ్ కుటుంబమే నిర్వహిస్తోంది. ముంబైలోని ప్రముఖ ఇంటర్‌ కాంటినెంటల్ హోటల్‌ కూడా ఈ గ్రూప్ లోనిదే. మంచి సంబంధం కావడంతోనే అర్జున్ పెళ్లికి సచిన్ ఓకే చెప్పినట్లు సమాచారం.

Story first published: Thursday, August 14, 2025, 13:05 [IST]
Other articles published on Aug 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+