Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నికోలస్ పూరన్ రిటైర్మెంట్‌కు కారణాలు ఇవే!

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 29 ఏళ్ల వయసులోనే దేశం తరఫున ఆడలేనని ప్రకటించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారు పేరు అయిన నికోలస్ పూరన్ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని, తనపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నికోలస్ పూరన్ ఓ సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నాడు.

మాటల్లో చెప్పలేను

'డియర్ ఫ్యాన్స్.. చాలా ఆలోచనలు, పరిశీలనల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఈ ఆట నాకెంతో ఇచ్చింది. ఇంకా ఇస్తూనే ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎంతో ఆనందం, ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నా. మెరూన్ జెర్సీని ధరించడం, మైదానంలో నిలబడి జాతీయ గీతం ఆలపించడం.. జట్టు కోసం సాయశక్తులా కృషి చేయడం.. ఇవన్ని నాకు ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేను. వెస్టిండీస్ జట్టుకు సారథ్యం వహించడం ఎప్పటికీ మరిచిపోలేను.

Take a Poll

అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తాను. నాపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు. కష్ట సమయాల్లో అండగా నిలిచారు. నా సక్సెస్‌ను సెలెబ్రేట్ చేసుకున్నారు. నా కుటుంబం, స్నేహితులు, నా సతీమణితో పాటు నా ఈ ప్రయాణంలో నాతో నడిచిన మీకు ధన్యవాదాలు. మీ మద్దతు, నమ్మకం నన్ను నిలబెట్టాయి. నా కెరీర్‌లో అంతర్జాతీయ అధ్యాయం ముగిసినప్పటికీ.. వెస్టిండీస్ క్రికెట్‌పై నాకున్న ప్రేమ ఎప్పటికీ చెక్కు చెదరదు. వెస్టిండీస్ జట్టు మరింత బలంగా మారడంతో పాటు అద్భుతమై విజయాలు అందుకోవాలని కోరుకుంటా.'అని నికోలస్ పూరన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

రిటైర్మెంట్‌కు కారణాలు

అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణించ లేకపోవడం, బిజీ షెడ్యూల్, ఇతర కమిట్‌మెంట్ల కారణంగా నికోలస్ పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చాలా మంది ఆటగాళ్లు జాతీయ జట్టు తరఫున ఆడటం కంటే ఫ్రాంచైజీ క్రికెట్‌ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. పూరన్ కూడా ఇదే బాటలో నడిచినట్లు అర్థమవుతోంది. ఇతర వ్యక్తిగత కారణాలు కూడా అతని రిటైర్మెంట్ నిర్ణయంపై ప్రభావం చూపి ఉండవచ్చనే అభిప్రాయం కలుగుతోంది. ముఖ్యంగా ఫ్రాంచైజీ క్రికెట్‌తో తీరికలేని క్రికెట్ ఆడుతుండటంతో ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోతున్నాననే బాధ పూరన్‌ను వెంటాడినట్లు తెలుస్తోంది. మరింత ఫిట్‌గా ఉండటంతో పాటు సుదీర్ఘ కాలం ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఏది ఏమైనా నికోలస్ పూరన్ ఆకస్మిక నిర్ణయం వెస్టిండీస్ క్రికెట్‌కు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.

FAQs
MyKhel Sports
Story first published: Tuesday, June 10, 2025, 17:19 [IST]
Other articles published on Jun 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+