Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

18 బంతుల్లో 50.. వైభవ్ సూర్యవంశీ‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎందుకు రాలేదంటే..?

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు జూలు విధిల్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఈ 15 ఏళ్ల సిక్సర పిడుగు పరుగుల మోత మోగించడం మొదలెట్టాడు. ఇంగ్లండ్‌తో వరుసగా మూడు టీ20ల్లో విఫలమైన వైభవ్.. జింబాబ్వేతో తొలి మ్యాచ్‌లోనే రికార్డ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. హరారే వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

IND vs ZIM: చెత్త పిచ్ వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్

IND vs ZIM: చెత్త పిచ్ వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్

ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై తన విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ విజయాన్ని సునాయసం చేసిన వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కలేదు. కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసిన భారత పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్‌కు ఈ అవార్డ్ వరించింది. ఇది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Why Did Mayank Yadav Win Player Of The Match Instead Of Vaibhav Sooryavanshi In IND Vs ZIM 1st T20I

మయాంక్ యాదవ్‌కు ఎందుకంటే..?

అయితే వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించినా.. దానికి సరైన ఫ్లాట్‌ఫామ్ సెట్ చేసింది మాత్రం మాయంక్ యాదవ్. రెండే ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్.. ఇన్నింగ్స్ తొలి బంతికే జింబాబ్వే కీలక ఓపెనర్ అయిన బ్రియాన్ బెన్నెట్ వికెట్‌ తీసి ఆ జట్టుకు దిమ్మతిరిగే షాకిచ్చాడు.

అంతేకాకుండా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధించి పరుగులను నియంత్రించాడు. ఐదో ఓవర్‌లో మరో బ్యాటర్ డియోన్ మైయర్స్ వికెట్‌‌ను కూడా పడగొట్టి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీసాడు.

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో..

కీలకమైన పవర్ ప్లేలో మూడు ఓవర్లు వేసి 2 వికెట్లు తీయడంతో పాటు 10 పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన మయాంక్ యాదవ్ 8 పరుగులిచ్చుకున్నాడు. పవర్ ప్లేలో కట్టడిగా బౌలింగ్ చేయడంతో బంతి షైన్ దెబ్బతినలేదు. దాంతో మిడిల్ ఓవర్లలో కూడా జింబాబ్వే పరుగులు రాబట్టడం కష్టమైంది. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ సికిందర్ రాజానే తెలిపాడు.

చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 37 ఏళ్ల రికార్డ్ బద్దలు!

చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 37 ఏళ్ల రికార్డ్ బద్దలు!

టీ20ల్లో పరుగులను నియంత్రించడం కూడా వికెట్లు తీసినంత. అందుకే 4.50 ఎకానమీతో బౌలింగ్ చేసి మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పినందుకు మయాంక్ యాదవ్‌కు ఈ అవార్డ్ లభించింది. వైభవ్‌కు అవార్డు రాకపోయినా.. అతనిది కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనేనని మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ కొనియాడాడు.

Story first published: Friday, July 24, 2026, 9:33 [IST]
Other articles published on Jul 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+