Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

10 వికెట్లు తీసిన మానవ్ సుతార్‌కు అన్యాయం.. పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్!

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గాలే వేదికగా బుధవారం ముగిసిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన దేవదత్ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అయితే దేవదత్ పడిక్కల్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 10 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించిన మానవ్ సుతార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఇవ్వాల్సిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బౌలర్ అనే చిన్న చూపుతో అతనికి అన్యాయం చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు.

పడిక్కల్‌కు అవార్డ్ ఎందుకంటే..?

తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులతో భారీ శతకం నమోదు చేసిన దేవదత్ పడిక్కల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో విలువైన 44 పరుగులతో విజయానికి బాటలు వేసాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్వితీయమైన బ్యాటింగ్ ప్రదర్శన చేయడంతోనే పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కిందని అతని మద్దతుదారులు కామెంట్ చేస్తున్నారు.

Why Devdutt Padikkal Was Named Player of the Match Despite Manav Suthar s 10-Wicket Haul in Galle Test

అయితే పడిక్కల్‌తో పాటు మానవ్ సుతార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు అర్హుడే. కానీ మ్యాచ్‌పై ఎవరు ఎక్కువ ప్రభావం చూపారనేది పరిగణలోకి తీసుకొని పడిక్కల్‌కు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. పడిక్కల్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడమే కాకుండా 167 పరుగులతో జట్టుకు 462 పరుగుల భారీ స్కోర్ అందించాడు. దాంతో మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇతర బ్యాటర్లు విఫలమైన వేళ 44 పరుగులతో జట్టు భారీ లక్ష్యం నమోదు చేయడంలో పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు.

శుభ్‌మన్ గిల్ సైతం..

మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ కూడా.. పడిక్కల్ అద్భుత ప్రదర్శనతోనే విజయం సాధ్యమైందని ప్రశంసించాడు.పడిక్కల్‌తో పోల్చితే మానవ్ సుతార్ ప్రదర్శన ఏ మాత్రం తక్కువ కాదు. అతను వికెట్లు తీయడంతో భారత్ విజయం లాంఛనమైంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అతను తీసిన 6 వికెట్లు భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. కానీ మానవ్ సుతార్ కంటే పడిక్కల్ ప్రదర్శన భారత్‌ విజయంపై ఎక్కువ ప్రభావం చూపడంతో అతనికి ఈ అవార్డ్ లభించింది.

Story first published: Wednesday, August 19, 2026, 19:17 [IST]
Other articles published on Aug 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+