Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS 5th T20I: దీపక్ చాహర్ ఎందుకు ఆడటం లేదంటే..?

Deepak Chahar: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ దూరమయ్యాడు. నాలుగో టీ20లో అవకాశం అందుకున్న అతను.. చివరి మ్యాచ్‌కు ముందుకు ఇంటికి వెళ్లిపోయాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అతను ఇంటికి వెళ్లాడని టాస్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడని సూర్యకుమార్ యాదవ్ టాస్ సందర్భంగా చెప్పాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. మా ఆటగాళ్లకు నేను ఒక్కటే చెప్పాను. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ప్రేక్షకులతో కిక్కిరిసే మైదానంలో ఆడేందుకు మీకు మరో అవకాశం ఇస్తున్నా. నిర్భయంగా ఆటను ఆస్వాదించండని చెప్పాను. ఇప్పటి వరకు బ్యాటింగ్ యూనిట్ ఎలా రాణించిందో అదే కొనసాగించాలని చెప్పాను. దీపక్ చాహర్ ఇంటికి వెళ్లడంతో అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Why Deepak Chahar is not playing in India vs Australia 5th T20I

నాలుగో టీ20లో రెండు కీలక వికెట్లు తీసిన దీపక్ చాహర్.. అత్యవసరంగా ఇంటికి వెళ్లడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతని సతీమణి డెలివరీకి సిద్దంగా ఉందా? లేక కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీపక్ చాహర్ గైర్హాజరీ గురించి అతను గానీ.. బీసీసీఐ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. రెండు భారీ సిక్సర్లతో దూకుడు కనబర్చిన యశస్వీ జైస్వాల్(21)‌తో పాటు మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(10) వరుస ఓవర్లలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. దాంతో క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చారు. ఈ ఇద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సిరీస్‌కు 17 మంది సభ్యులను ఎంపిక చేయగా.. 15 మందికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. కానీ వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే‌లకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వారికి అవకాశం ఇస్తారని అభిమానులు భావించారు. కానీ మరోసారి వారిని బెంచ్‌కే పరిమితం చేశారు.

తుది జట్లు:

భారత్: యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ(కీపర్), అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్, బెన్ మొక్‌డెర్మోట్, ఆరోన్ హార్డీ, టీమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్(కీపర్), బెన్ ద్వార్షూయిస్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రాండార్ఫ్, తన్వీర్ సంఘా.

Story first published: Sunday, December 3, 2023, 19:41 [IST]
Other articles published on Dec 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+