Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2021: అందుకే శిఖర్ ధావన్‌కు అవకాశం దక్కలేదు!

Why big-match player Shikhar Dhawan missed out in T20 World Cup selection

ముంబై: టీ20 ప్రపంచకప్ జట్టులో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఊహించినట్లుగా ఈ జట్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు చోటు దక్కలేదు. ఓపెనింగ్‌ స్లాట్‌లో ఖాళీ లేకపోవడంతోనే ధావన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని సెలక్టర్లు పేర్కొన్నారు.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రూపంలో ఇద్దరు ఓపెనర్లు జట్టులో ఉండటం.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఓపెనింగ్ చేస్తానని చెప్పడం.. బ్యాకప్ కీపర్‌గా తీసుకున్న ఇషాన్ కిషన్ కూడా ఓపెనర్‌గా ఆడే సామర్థ్యం ఉండటంతో ధావన్‌కు అవకాశం లేకుండా పోయింది. అయితే ధావన్‌ను పక్కనపెట్టండపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధావన్ కంటే ఇషాన్ గొప్పోడా?

ధావన్ కంటే ఇషాన్ గొప్పోడా?

కేఎల్ రాహుల్ రూపంలో బ్యాకప్‌గా కేఎల్ రాహుల్ ఉండగా.. ఇషాన్ కిషన్‌ను ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇషాన్ బదులు శిఖర్ ధావన్‌ను తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఆసియేతర దేశాల్లో, మెగాటోర్నీల్లో శిఖర్ ధావన్‌కు మంచి రికార్డుందని గుర్తు చేస్తున్నారు. అయితే ధావన్‌ను పక్కన పెట్టడానికి ప్రధాన కారణం అతని నెమ్మదైన బ్యాటింగేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌లో నిలకడ ఉంటుందని.. కానీ ఆరంభంలో అతని బ్యాటింగ్‌ నెమ్మదిగా సాగుతుంది.

వ్యక్తిగత జీవితం..

వ్యక్తిగత జీవితం..

క్రీజులో నిలుదొక్కుకున్న తర్వాత తనదైన శైలిలో వేగంగా ఆడడం ధావన్‌ స్టైల్‌. కానీ టీ20లు అంటేనే మెరుపులకు పెట్టింది పేరు. ధావన్‌ మంచి ఆటగాడే అయినప్పటికీ బంతులు ఎక్కువగా తీసుకుంటాడని.. అది ఆటకు సరిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ధావన్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను మూడో ఓపెనర్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ధావన్‌ వ్యక్తిగత జీవితం కూడా అతని ఎంపికపై ప్రభావం చూపినట్లు ఫ్యాన్స్‌ పేర్కొంటున్నారు. ధావన్‌, అయేషా ముఖర్జీలు తొమ్మిదేళ్ల వైవాహిక జీవితం అనంతరం విడాకులు తీసుకోవడం అతని కెరీర్‌పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు.

ధావన్‌ను తీసుకోవాల్సిందే..

ధావన్‌ను తీసుకోవాల్సిందే..

వాస్తవానికి 35 ఏళ్ల శిఖర్‌ ధావన్‌ లంక పర్యటనతో పాటు ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మంచి ప్రదర్శనను కనబరిచాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న శిఖర్‌ ధావన్‌ 8 మ్యాచ్‌ల్లో 380 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. అంతేకాదు లంక పర్యటనలోనూ అటు కెప్టెన్సీలోనూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శనను కనబరిచాడు.

ఇవీ గాక ధావన్‌కు ఐసీసీ టోర్నమెంట్‌లో మంచి రికార్డు ఉంది. 2013 చాంపియన్స్‌ ట్రోపీని భారత్‌ గెలవడంలో శిఖర్‌ ధావన్‌ పాత్ర కీలకం. ఆ టోర్నీలో టీమిండియా ఓపెనర్‌గా రాణించిన ధావన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. ఇక బ్యాకప్‌ ఓపెనర్‌గా శిఖర్‌ ధావన్‌ సరిపోతాడనేది చాలా మంది అభిప్రాయం. ఇషాన్‌ కిషన్‌కు మంచి స్ట్రైక్‌ రేట్‌ ఉండొచ్చు.. కానీ అనుభవంలో మాత్రం ధావన్‌కు పోటీగా రాలేడని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

అరబ్ గడ్డపై చెలరేగితే..

అరబ్ గడ్డపై చెలరేగితే..

ప్రస్తుతానికి జట్టును ప్రకటించినా... ఐసీసీ నిబంధనల ప్రకారం అక్టోబర్‌ 10 వరకు టీమ్‌లో మార్పుచేర్పులు చేయవచ్చు. ఐపీఎల్‌ ముగిశాక అక్కడి ప్రదర్శనను బట్టి లేదా గాయాలవంటి కారణాలతో చివరి నిమిషంలో మార్పులకు చాన్స్‌ ఉంది. కాబట్టి దుబాయ్ గడ్డపై ధావన్ చెలరేగితే అతన్ని జట్టులోకి తీసుకోవచ్చు. భారత్‌లో చూపించిన ఫామ్‌నే అక్కడ కొనసాగిస్తే గబ్బర్‌కు తిరుగుండదు.

Story first published: Thursday, September 9, 2021, 14:37 [IST]
Other articles published on Sep 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+