Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆరెంజ్ ఆర్మీ చేతిలో ఆర్‌సీబీ భవితవ్యం..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో బ్లాక్‌బాస్టర్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. లక్నో వేదికగా నేడు(శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి టాప్-2 ప్లేస్‌ను ఖరారు చేసుకోవాలని ఆర్‌సీబీ భావిస్తుంది. మరోవైపు ఆరెంజ్ ఆర్మీ పరువు కోసం పాకులాడుతోంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించి ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇప్పుడు ఆర్‌సీబీ టాప్-2 అవకాశాలను గల్లంతు చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టాప్-2లో నిలవాలంటే..?
ప్రస్తుతం ఆర్‌సీబీ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు ఓ మ్యాచ్ రద్దుతో 17 పాయింట్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్‌పై విజయం సాధిస్తే 19 పాయింట్స్‌తో టేబుల్ టాపర్‌గా నిలుస్తోంది. అప్పుడు లాస్ట్ మ్యాచ్ గెలిచినా.. రద్దయినా టాప్-2 ప్లేస్ ఖరారవుతోంది. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్‌లు గెలిస్తే మాత్రం ఏ జట్టుతో సంబంధం లేకుండా 21 పాయింట్లతో ఆర్‌సీబీ టాప్-2లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఆరెంజ్ ఆర్మీ చేతిలో ఆర్‌సీబీ భవితవ్యం ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం 17 పాయింట్స్‌తో టాప్-2 ప్లేస్ కోల్పోతుంది. ఒక మ్యాచ్ గెలిస్తే 19 పాయింట్స్ నిలుస్తుంది. కానీ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.

Why an RCB Win Over SRH is Crucial for Their Top-Two Berth in IPL 2025

ఆర్‌సీబీ vs SRH హెడ్ టు హెడ్..
ఈ సీజన్‌లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ తొలి పడుతున్నాయి. లీగ్ చరిత్రలో ఇరు జట్లు 25 మ్యాచ్‌లు ఆడగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్‌లు గెలిచింది. ఆర్‌సీబీ 11 గెలవగా.. మరో మ్యాచ్‌ ఫలితం తేలలేదు. గత సీజన్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి.

తుది జట్లు(అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్ : 1 ట్రావిస్ హెడ్, 2 అభిషేక్ శర్మ, 3 ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), 4 నితీష్ రెడ్డి, 5 హెన్రిచ్ క్లాసెన్, 6 అనికేత్ వర్మ, 7 అభినవ్ మనోహర్, 8 ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), 9 హర్షల్ పటేల్, 10 హర్ష్ దూబే, 11 ఇషాన్ మలింగ, 12 జయదేవ్ ఉనద్కట్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 1 ఫిల్ సాల్ట్, 2 విరాట్ కోహ్లీ, 3 మయాంక్ అగర్వాల్, 4 రజత్ పాటిదార్ (కెప్టెన్), 5 జితేష్ శర్మ (వికెట్ కీపర్), 6 రొమారియో షెపర్డ్, 7 టిమ్ డేవిడ్, 8 కృనాల్ పాండ్యా, 9 భువనేశ్వర్ కుమార్, 10 యష్ దయాల్, 11 లుంగి ఎంగిడి, 12 సుయష్ శర్మ.

Story first published: Friday, May 23, 2025, 11:48 [IST]
Other articles published on May 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+