
శ్రేయస్ అయ్యర్ రాకతో..
ఇక కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే దుమ్మురేపాడు. న్యూజిలాండ్‌తోనే జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాది మిడిలార్డర్‌లో తాను సెట్‌అవుతానని సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు కేఎల్ రాహుల్ గాయంతో ఈ సిరీస్‌కు దూరం కాగా.. రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. రోహిత్, కేఎల్ రాహుల్, కోహ్లీ తిరొగిచ్చినా.. శ్రేయస్ అయ్యర్‌ను ఆడించాలని భావించినా రహానేకు చోటు దక్కడం కష్టం. ఇప్పటికే చాలా అవకాశాలు అందుకున్న రహానే.. ఆడపాదడపా ఇన్నింగ్స్‌లు మినహా పెద్దగా రాణించింది లేదు. ఈ క్రమంలో కోహ్లీ అందుబాటులో ఉండే రెండో టెస్ట్‌లో కూడా అతనికి చోటు దక్కడం కష్టమే అనిపిస్తుంది.

మెల్‌బోర్న్ సెంచరీ తర్వాత..
ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్ట్ ఘోర పరాజయం తర్వాత జట్టును నడిపించిన రహానే.. కీలక మెల్ బోర్న్ టెస్ట్‌లో సెంచరీతో జట్టుకు విజయాన్నందించాడు. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. సిడ్నీ టెస్ట్, బ్రిస్బేన్ టెస్ట్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అయితే ఆ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంతో రహానే వైఫల్యం పెద్దగా చర్చనీయాంశం కాలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 49 పరుగులతో పర్వాలేదనిపించినా.. రెండో ఇన్నింగ్స్‌లో 19 రన్స్‌కే ఔటయ్యాడు. అనంతరం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 5, 1, 61, 18, 10, 14, 0 దారుణంగా విఫలమయ్యాడు.

కోహ్లీ వెనకేసుకొచ్చినా..
రహానే విఫలమైన ప్రతీసారి కోహ్లీ వెనకేసుకొచ్చాడు. ఫామ్ టెంపరరీ అని, క్లాస్ పర్మినెంట్ అంటూ అతనికి అవకాశాలు ఇచ్చాడు. ఇక భారత జట్టు విజయాల నేపథ్యంలో రహానే ఫామ్‌పై కూడా పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. రిజర్వ్ బెంచ్‌పైన ఉన్న ఆటగాళ్లు సైతం అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వరుసగా విఫలమవుతున్న రహానేకు అవకాశాలు ఇస్తే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతాయి. సీనియర్ ప్లేయరంటూ కోహ్లీ వెనకేసుకొచ్చినా వినడానికి అక్కడ రవిశాస్త్రి లేడు. నయా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. కాబట్టి రహానే కెరీర్ ముగిసినట్లేనని అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ద్రవిడ్ ఏం చేస్తాడో..?
'కెప్టెన్‌గా పనికొస్తాడనే ఒకే ఒక్క కారణంతో అజింక్యా రహానే జట్టులో కొనసాగుతున్నాడు. అదృష్టం అంటే రహానేదే. ఇన్ని అవకాశాలు నాకు తెలిసి మరే క్రికెటర్ అందుకోలేదు'అంటూ ఈ టెస్ట్ సిరీస్ ముందు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. రహానే తాజా వైఫల్యం ఈ విమర్శలను బలపరుస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక సెకండ్ టెస్ట్‌లో కోహ్లీ కమ్ బ్యాక్ చేస్తే రహానే చోటు గల్లంతవ్వడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెడితే టీమ్‌మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వస్తాయని, ఆ సాహసం చేయకపోవచ్చంటున్నారు. అయితే టీమిండియా గత చరిత్ర పరిశీలిస్తే మాత్రం.. అయ్యర్‌ను పక్కనపెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని కామెంట్ చేస్తున్నారు. గతంలో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ బాదినా.. అతనిపై వేటు వేసారని గుర్తు చేస్తున్నారు. మరీ ద్రవిడ్ ఏం చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications
