For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NED: సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. తన సొంత జెర్సీకి బదులుగా మహమ్మద్ సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే జెర్సీ మార్చినా అభిషేక్ శర్మకు మాత్రం కలిసి రాలేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అతను డకౌట్‌గా వెనుదిరిగాడు.

నెదర్లండ్స్ బౌలర్ ఆర్యన్ దత్ వేసిన తొలి ఓవర్‌లో మూడు బంతులు ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ టోర్నీలో అభిషేక్ శర్మకు వరుసగా ఇది మూడో డకౌట్‌. ఈ మెగా టోర్నీతోనే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆడటం మొదలుపెట్టిన అభిషేక్ శర్మ మూడు మ్యాచ్‌లు అయినా ఒక్క పరుగు చేయలేకపోయాడు.

సిరాజ్ జెర్సీలో ఎందుకంటే..?

అభిషేక్ శర్మ.. సిరాజ్ జెర్సీ ధరించి బరిలోకి దిగడంపై భిన్న వాదానాలు వినిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ తన జెర్సీని హోటల్ గదిలో మర్చిపోయాడని ఈ మ్యాచ్‌కు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న నాజర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ తమ వ్యాఖ్యానంలో తెలియజేశారు.

అయితే మైదాన వర్గాల సమాచారం ప్రకారం.. అభిషేక్ శర్మ జెర్సీ తెచ్చుకున్నా.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి తీసుకురాలేకపోయారని, దాంతోనే సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగాడని తెలుస్తోంది. కానీ ఫీల్డింగ్ సమయంలోనూ అభిషేక్ శర్మ.. సిరాజ్ జెర్సీలోనే కనిపించాడు. జెర్సీ అందుబాటులో లేకపోవడంతోనే బెంచ్ ప్లేయర్ అయిన సిరాజ్ జెర్సీ నెంబర్ 73 ధరించి అభిషేక్ శర్మ బరిలోకి దిగినట్లు అర్ధమవుతుంది.

Why Abhishek Sharma Wore Mohammed Siraj s Jersey in T20 World Cup 2026 Clash vs Netherlands
Photo Credit: screen grab for JioHotstar

ఐసీసీ రూల్స్ ప్రకారం..

ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాడు తన సొంత నంబర్ ఉన్న జెర్సీనే ధరించాలి. అయితే, అసాధారణ పరిస్థితుల్లో ఆటగాళ్లు ఇలా వేరే ఆటగాడి జెర్సీని ధరించి బరిలోకి దిగుతుంటారు. గతంలో చాలా మంది ఆటగాళ్లు ఇలా తమ సహచర ఆటగాళ్ల జెర్సీలతో బరిలోకి దిగారు.

అభిషేక్ శర్మ ఆడిన గత 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సార్లు డకౌటవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత 7 ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ శర్మ.. 0 (1), 68* (20), 0 (1), 30 (16), 0 (1), 0 (4), 0 (3) ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇందులో వరుసగా మూడు డకౌట్స్ ఉండటం, కీలక సూపర్-8 దశ ముందు అతను ఫామ్ కోల్పోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

అభిషేక్ శర్మ చెత్త రికార్డ్

ఈ పేలవ ప్రదర్శనతో అభిషేక్ శర్మ తన పేరిట పలు చెత్త రికార్డ్‌లను లిఖించుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన నాలుగో బ్యాటర్, రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన తొలి భారత ఓపెనర్‌గా కూడా అభిషేక్ శర్మ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఆరో బ్యాటర్‌గా ఈ చెత్త ఫీట్ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ అయుబ్ అగ్రస్థానంలో ఉన్నాడు. గతేడాది అతను 6 సార్లు డకౌటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్నీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. శివమ్ దూబే(31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోగా..తిలక్ వర్మ(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 34) దూకుడుగా ఆడలేకపోయారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్(3/56) మూడు వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ క్లేన్ ఒక వికెట్ తీసాడు.

Story first published: Wednesday, February 18, 2026, 21:29 [IST]
Other articles published on Feb 18, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+