ఒకే సీజన్‌లో 60 వికెట్లు.. అయినా అకీబ్ నబీకి దక్కని చోటు! ఎందుకంటే..?
ప్రతీష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ కంటే ఐపీఎలే ఎక్కువ అనే విషయం మరోసారి స్పష్టమైంది. అఫ్గానిస్థాన్‌తో సొంతగడ్డపై జరిగే ఏకైక టెస్ట్‌కు సెలెక్టర్లు భారత జట్టును ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిదే. అయితే ఈ జట్టులో జమ్మూకశ్మీర్ పేస్ సంచలనం అకీబ్ నబీకి చోటు దక్కకపోవడం విస్మయానికి గురి చేసింది.
రంజీ ట్రోఫీలో అతను 60 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంతో పాటు తన జమ్మూ కశ్మీర్ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన అతనికి కాస్ట్‌లీ ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను తెచ్చిపెట్టింది. కానీ భారత టెస్ట్ టీమ్‌లో చోటు సంపాదించడానికి మాత్రం ఇది సరిపోదని తేలింది.
దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ రెడ్-బాల్ బౌలర్‌గా నిరూపించుకున్నా.. దిగ్గజ జట్లను ఓడించి తమ రాష్ట్రానికి రంజీ ట్రోఫీని అందించినా.. కీలక మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టినా.. భారత టెస్ట్ జట్టులో మాత్రం అతనికి చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మద్దతు లేదన్న కారణాలతో అకీబ్ నబీని పక్కనపెట్టినట్లు అర్థమవుతోంది.
23 వికెట్ల బౌలర్‌కు చోటు..
భారత గడ్డపై ఆడేటప్పుడు పేసర్ల అవసరం అంతగా ఉండదని, అందుకే నబీని ఎంపిక చేయలేదని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చాడు. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు అతనికి కచ్చితంగా అవకాశం ఉంటుందని తెలిపాడు. కానీ పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్ ఎంపిక చేసి, నబీని పక్కన పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
రంజీ ట్రోఫీలో గర్నూర్ బ్రార్ ఏడు మ్యాచ్‌ల్లో 21.26 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. నబీ ప్రదర్శనతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-ఏ తరఫున గర్నూర్ బ్రార్.. పింక్‌బాల్ టెస్ట్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా బౌన్స్‌కు అనుకూలించే పిచ్‌లపై అతను చెలరేగాడు.

వన్డే ప్రపంచకప్ కోసం..
ఒత్తిడిలోనూ నిలకడగా రాణించే సామర్థ్యం ఉండటంతో పాటు సౌతాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు సిద్దం చేయాలనే ఉద్దేశంతో గర్నూర్ బ్రార్‌ను ఎంపిక చేసినట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చాడు. 'గత సీజన్నరగా గుర్నూర్ నిలకడగా రాణిస్తున్నాడు. పోడవైన వ్యక్తి కావడంతో అతని బౌలింగ్‌లో మంచి పేస్ ఉంది. వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త బౌలర్లను సిద్దం చేయాలనుకుంటున్నాం. ఆ ప్రణాళికల్లో భాగంగానే బ్రార్‌ను ఎంపిక చేశాం.’అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు.
అంతేకాకుండా బ్రార్‌కు భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మద్దతు ఉంది. బ్రార్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. అక్కడ అతను ఆశిష్ నెహ్రా పర్యవేక్షణలో మరింత రాటు దేలుతున్నాడు.
రంజీ క్రికెట్ ఎందుకు..?
అగార్కర్ వివరణ సమర్థవంతంగానే ఉన్నా.. అకీబ్ నబీని ఎంపిక చేయకపోవడం మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోసారి రంజీ క్రికెట్‌కు సెలెక్టర్లు విలువ ఇస్తలేరనే వాదన చర్చనీయాంశమైంది. రంజీ క్రికెట్‌లో టాప్ వికెట్ టేకర్‌కు భారత జట్టులో చోటు దక్కకపోతే.. ఆ టోర్నీకి ఉన్న విలువ ఏంటి? అని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌కు భారత జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications