For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs SRH: సన్‌రైజర్స్ సర్‌ప్రైజ్ వెపన్.. ఎవరీ జీషన్ అన్సారీ..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం వైజాగ్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. మరోసారి పేలవ బ్యాటింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ మ్యాచ్‌లో రెండు సానుకూలంశాలు లభించాయి. యువ ప్లేయర్ అనికేత్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74)‌తో పాటు అరంగేట్రం ప్లేయర్ జీషన్ అన్సారీ(3/42) అద్భుత ప్రదర్శన కనబర్చారు.

ముఖ్యంగా జీషన్ అన్సారీ ప్రదర్శన ఆకట్టుకుంది. సిమర్జిత్ సింగ్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన జీషన్ అన్సారీ తొలి మ్యాచ్‌లోనే చెలరేగాడు. సన్‌రైజర్స్ టాప్ బౌలర్లంతా విఫలమైన వేళ 3 వికెట్లు పడగొట్టాడు. దాంతో జీషన్ అన్సారీ గురించి తెలసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఎవరీ జీషన్ అన్సారీ..?
లెగ్ స్పిన్ బౌలర్ అయిన జీషన్ అన్సారీ.. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తర ప్రదేశ్‌ జట్టుకు ఆడుతున్నాడు. అతను ఇప్పటి వరకు 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, ఒక టీ20 ఆడి 17 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 40 లక్షల ధరకు కొనుగోలు చేసింది. 2016 అండర్ 19 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత అండర్ 19 జట్టులోనూ జీషన్ అన్సారీ సభ్యుడు. ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన జీషన్.. 35 పరుగులు చేశాడు.

Who Is Zeeshan Ansari SRH s Surprise Weapon Made IPL debut In IPL 2025 Match vs DC
Photo Credit: SRH twitter(X)

యూపీ టీ20 లీగ్‌లో జీషన్ అన్సారీ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మీరట్ మావెరిక్స్ టీమ్ తరఫున 12 ఇన్నింగ్స్‌ల్లో 7.63 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టాడు. ఆ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసే సామర్థ్యం అతని సొంతం. సన్‌రైజర్స్ఇం ట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ జీషన్ సత్తా చాటడంతో అతన్ని తుది జట్టులోకి తీసుకుంది.

టైలర్ కొడుకు..
జీషన్ అన్సారీది దిగువ మధ్య తరగతి కుటుంబం. అతని తండ్రి ఓ టైలర్. లక్నోలో ఓ టైలర్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆ సంపాదనతోనే 19 మంది సభ్యులు కలిగిన తన ఉమ్మడి కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కన్నయ్య లాల్ అనే వ్యక్తి జీషన్‌ను ప్రోత్సహించాడు. 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్రికెట్‌పై అతనికి ఉన్న మక్కువను గుర్తించిన అతను క్రికెట్‌లో ఓనమాలు నేర్పాడు. మెరుగ్గా రాణించడంతో అతని తండ్రి కూడా అండగా నిలిచాడు.

Story first published: Sunday, March 30, 2025, 16:14 [IST]
Other articles published on Mar 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+