Yash Vir Singh: ఎవడ్రా వీడు మరి ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు! ఆఖరి త్రోతో మెడల్ ఎగరేసుకుపోయాడు!
జావెలిన్ త్రో గేమ్‌లో మరో భారత స్టార్ పుట్టుకొచ్చాడు. జావెలిన్ త్రోలో హేమాహేమీలైన అండర్సన్ పీటర్స్, అర్షద్ నదీమ్, కేషోర్న్ వాల్‌కట్‌ను అధిగమించి మరీ కాంస్య పతకం అందుకున్నాడు. నీరజ్ చోప్రా కంటే ఈ యువ బళ్లెం వీరుడి గురించే యావత్ భారత్ ఇప్పుడు మాట్లాడుకుంటుంది. అతనెవరో కాదు 24 ఏళ్ల యశ్వీర్ సింగ్.!
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించగా.. యశ్వీర్ సింగ్ సంచలన ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. యశ్వీర్ సింగ్ విజయం వెనుక చాలా డ్రామా జరిగింది. తొలి త్రోనే ఫౌల్ చేసిన యశ్వీర్ సింగ్.. నాలుగో ప్రయత్నంలో కూడా ఫౌల్ చేశాడు.

అప్పటికి 81.33 మీటర్లు విసిరి రేసులోఉన్నా.. అది సరిపోలేదు. చివరి త్రో వేసేందుకు సిద్దమైన తరుణంలో నీరజ్ చోప్రా ఇచ్చిన మద్దతు యశ్వీర్‌కు సాయపడింది. తన రన్నప్‌ను మార్చుకున్న యశ్వీర్ సింగ్.. ఆఖరి ప్రయత్నంలో ఈటెను ఏకంగా 85.41 మీటర్ల దూరం విసిరి మూడో స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. ఈ విజయంతో యశ్వీర్ సింగ్ టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. యశ్వీర్ సింగ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.
ఎవరీ యశ్వీర్ సింగ్..?
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన యశ్వీర్ చిన్నతనంలో బాస్కెట్‌బాల్ ఆడేవాడు. ఫిట్‌నెస్ కోసం ఈ ఆటను ఎంచుకున్నాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో జావెలిన్ క్రీడకు మారిపోయాడు. ఆరంభంలో వెదురుబొంగు కర్రలతో ప్రాక్టీస్ చేసేవాడు. ప్రొఫెషనల్‌గా మారే ముందు వరకూ అతను వాటితోనే సాధన చేశాడు. తన తండ్రి రాయ్ సింగ్ కూడా జాతీయ స్థాయి జావెలిన్ త్రో అథ్లెట్. ఆయన మార్గదర్శకంలోనే యశ్వీర్ మెలకువలు నేర్చుకున్నాడు.
'కఠిన శ్రమ ఎప్పుడూ ఫలితాలను ఇస్తుంది. మా శిక్షణలో ప్రత్యేకత ఏం లేదు. కానీ, ఎక్కువ సమయం సాధన చేసేవాళ్లం. సరైన ఆహారం తీసుకోవడం, ప్రాక్టీస్ చేయడం ఇదే పని. నేను అథ్లెట్‌గా ఉన్నప్పుడు చాలా పొరపాట్లు చేశా. కానీ, నా కుమారుడి విషయంలో అలా చేయకుండా ఉండేందుకు శిక్షణనిచ్చా'అని రాయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అండర్ 20 ఫెడరేషన్ కప్‌తో వెలుగులోకి..
యశ్వీర్ అండర్ 20 ఫెడరేషన్ కప్‌లో నీరజ్ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించి తొలిసారి వెలుగులోకి వచ్చాడు. 2022లో 80 మీటర్ల మార్క్‌ను అందుకున్నాడు. 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 82.57 మీటర్లు విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు ఏకంగా కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఇది అతని కెరీర్ బెస్ట్ త్రో. వచ్చే లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో నీరజ్‌తో పాటు యశ్వీర్‌పై కూడా యావత్ భారత్ ఆశలను పెట్టుకోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

