For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కే చుక్కలు చూపించిన వైభవ్ అరోరా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు?

Who is Vaibhav Arora? All you need to know about PBKS bowling sensation

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్నందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆ జట్టు 54 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌తో పంజాబ్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ అరోరా తన ఫస్ట్ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్‌కు ముందే తమ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వైభవ్ అరోరా గురించి గొప్పగా చెప్పాడు. అతను రెండు వైపుల స్వింగ్ చేయగలడని, అతనిపై భారీ అంచనాలు పెట్టుకున్నామని వెల్లడించాడు. మయాంక్ చెప్పినట్లుగానే బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై వైభవ్ బంతితో చెలరేగాడు.

 కోలుకోలేని దెబ్బ తీసి..

కోలుకోలేని దెబ్బ తీసి..

తన స్వింగ్ బాల్స్‌తో చెన్నై బ్యాట్స్‌మన్‌ను వణికించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అరోరా.. 21 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆ జట్టు ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ‌లను పెవిలియన్ పంపి ఆరంభంలోనే చెన్నైని కోలుకోలేని దెబ్బతీసాడు.

ఆ జట్టు పేసర్‌ సందీప్ శర్మ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన అరోరా తనపై టీమ్ పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే సంచలన ప్రదర్శనతో వైభవ్ అరోరా మెరవడంతో నెటిజన్లు అతని కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వైభవ్ అరోరా గురుంచి తెలియని ఆసక్తికర విషయాలపై లుక్కెద్దాం.

కేకేఆర్ తీసుకున్నా..

కేకేఆర్ తీసుకున్నా..

వైభవ్ అరోరా డిసెంబర్ 14, 1997న హర్యానాలోని అంబాలాలో జన్మించాడు. మూడేళ్ల క్రితం (2019) హిమాచల్ ప్రదేశ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. సౌరాష్ట్రపై తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఆరోరా టీ20ల్లో 2021లో ఛత్తీస్‌గఢ్‌పై అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నెట్‌బౌలర్‌గా అరోరాను ఎంపిక చేసింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో వైభవ్ అరోరాను కోల్‌కతా నైట్ రైడర్స్‌ తీసుకున్నా తుది జట్టులో అవకాశం దక్కలేదు.

రూ.2 కోట్ల ధరకు..

రూ.2 కోట్ల ధరకు..

ఐపీఎల్‌-2022 సీజన్ మెగా వేలంలో వైభవ్ ఆరోరాను రూ. 2 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. తొలి రెండు మ్యాచ్‌లు బెంచ్‌పైనే కూర్చొబెట్టిన ఆ జట్టు.. వ్యూహాత్మకంగా మూడో మ్యాచ్‌లో అవకాశం ఇచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ బలహీనతను పసిగట్టిన పంజాబ్.. ఔటాఫ్ సిలబస్ బౌలర్‌లా ఆరోరాను బరిలోకి దింపి అనుకున్న ఫలితం సాధించింది. చెన్నై బ్యాటర్లలో చాలా మంది స్వింగ్ బాల్స్ ఆడలేరు. ఈ క్రమంలోనే స్వింగ్ స్పెషలిస్ట్ అయిన వైభవ్ అరోరా చెలరేగాడు. తన కెరీర్‌లో 12 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆరోరా 12 వికెట్లు పడగొట్టాడు.

ఆర్థిక సమస్యలతో..

ఆర్థిక సమస్యలతో..

ఆర్థిక సమస్యలతో వైభవ్ అరోరా కొన్నాళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతని చిన్ననాటి కోచ్ రవి వర్మ అతన్ని ప్రోత్సాహించాడంతో వైభవ్ అరోరా ఈ స్థాయికి చేరగలిగాడు. పంజాబ్ కింగ్స్ మరో పేసర్ అర్షదీప్ సింగ్‌, వైభవ్ అరోరా మంచి స్నేహితులు. ఈ ఇద్దరు కలిసి ఏజ్ లెవల్ క్రికెట్ చాలా ఆడారు. ఈ ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది.

Story first published: Monday, April 4, 2022, 15:16 [IST]
Other articles published on Apr 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+